రామ్ చ‌ర‌ణ్ మొద‌టి సంపాద‌న‌తో ఏం కొన్నాడో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్ప‌టికీ త‌న‌దైన టాలెంట్ తో అంచ‌లంచ‌లుగా ఎదిగాడు రామ్ చ‌ర‌ణ్‌. మెగా ప‌వ‌ర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తో గ్లోబ‌ర్ స్టార్ గా మారాడు. తండ్రిని మించిన త‌న‌యుడిగా ఎదిగి.. కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌` మూవీలో న‌టిస్తున్నాడు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది. ఈ మూవీ అనంత‌రం బుచ్చిబాబు డైరెక్ష‌న్ లో రామ్ చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్నాడు. మ‌రోవైపు అనేక టాప్ బ్రాండ్స్ కు రామ్ చ‌ర‌ణ్ ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అందులో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ మీషో ఒక‌టి. ఇప్ప‌టికే మీషో కోసం రామ్ చ‌ర‌ణ్ ప‌లు యాడ్స్ లో న‌టించాడు.

ఈ సంస్థ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అనేక విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న మొద‌టి సంపాద‌న‌తో ఏం కొన్నాడో కూడా రివీల్ చేశాడు. హ్యాండ్ వాచ్స్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని.. అందుకే మొదటి సంపాదనతో తాను వాచ్ కొన్నాన‌ని చ‌ర‌ణ్ పేర్కొన్నాడు. అలాగే త‌న వ‌ద్ద చాలా వాచ్ క‌లెక్ష‌న్స్ ఉన్నాయ‌ని.. వాటిలో కాసియో వాచ్ ది బెస్ట్ అని తెలిపాడు. ఇక ఫేవరెట్ వాచ్ ఏంటని ప్రశ్నించగా.. ప్రస్తుతం పటెక్ వాచ్ అని స‌మాధాన‌మిచ్చాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.