ఆ ఒక్క సినిమానే ఇద్దరి హీరోయిన్ల కెరియర్ ను మార్చేసిందా..!!

టాలీవుడ్ హీరో రామ్ చరణ్, రాజమౌళి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఏమిటంటే మగధీర అని చెప్పవచ్చు. ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కించారు.ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది.అయితే వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక స్టార్ హీరోయిన్ అనుకున్నారట.. 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టించింది.

Kajal Aggarwal and Anushka Shetty are front runners for Gopichand's next  with Teja? | Telugu Movie News - Times of India

ఇందులో శ్రీహరి, శరత్ బాబు, రావు రమేష్ తదితరులు సైతం ముఖ్యమైన పాత్రలో నటించారు. రూ 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో రూ.80 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రంతో కాజల్ అగర్వాల్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇలాంటి సినిమాని వదులుకున్న స్టార్ హీరోయిన్ ఉన్నది ఆమె ఎవరో కాదు హీరోయిన్ అనుష్క శెట్టి.. రాజమౌళి మొదట ఈ సినిమాలోని క్యారెక్టర్ అనుష్కకి సరిపోతుందని భావించారట.

రాజమౌళి ,అనుష్క కాంబినేషన్లో విక్రమార్కుడు సినిమా రావడం జరిగింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. ఇక మగధీర సినిమాలో రాజకుమారి పాత్రను అనుష్క పూర్తి న్యాయం చేస్తుందని భావించిన రాజమౌళి మొదట ఈమెనే మెయిన్ హీరోయిన్ గా అనుకొని స్టోరీ చెప్పారట. రామ్ చరణ్ తనకంటే పొట్టిగా ఉండడంతో హైట్ డిఫరెన్స్ కారణంగా అనుష్క ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట..

కానీ ఈ క్యారెక్టర్ కి కాజల్ అగర్వాల్ ని తీసుకోవడంతో ఈమె కెరియర్ మలుపు తిరిగింది.. అనుష్క ఈ సినిమా వదులుకున్నందుకు చాలా ఫీల్ అయినట్లుగా తన స్నేహితులతో చెప్పినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అనుష్క నటించిన కొన్ని సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అలా మగధీర సినిమా అటు కాజల్ ను స్టార్ హీరోయిన్ని చేయగా అనుష్క ఈ సినిమాను వదులుకోవడం చాలా దెబ్బ పడింది అని చెప్పవచ్చు.