వేణు వర్సెస్ బోస్..ఆగని రచ్చ..ఇండిపెండెంట్‌గా రెడీ.!

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తగ్గడం లేదు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు తారస్థాయిలో నడుస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాస్తవానికి రామచంద్రాపురం బోస్ సొంత సీటు..మూడు సార్లు అక్కడ బోస్ గెలిచారు.

గత ఎన్నికల్లో వేణుకు ఆ సీటు ఇచ్చారు..దీంతో ఆయన గెలుపు కోసం బోస్ సహకరించారు. ఇటు బోస్ మండపేటలో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు మొదట ఎమ్మెల్సీ, మంత్రి పదవి వచ్చింది..కానీ మండలి రద్దు అనడం వల్ల..పదవులు పోయాయి. ఆయనకు జగన్ రాజ్యసభ ఇచ్చారు. అయితే ఇప్పుడు తన సీటులోనే పోటీ చేయాలని బోస్ భావిస్తున్నారు. పైగా మంత్రి అయ్యాక వేణు..బోస్ వర్గాన్ని పట్టించుకోలేదు..అలాగే కేసులు కూడా పెట్టారట. అటు టి‌డి‌పిలో ఓడిపోయి వైసీపీలోకి వచ్చిన తోట త్రిమూర్తులు వర్గాన్ని సైతం వేణు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బోస్ అంటున్నారు.

తన దగ్గరకు వచ్చిన వారిని..వేణు దగ్గరకు రానివ్వడం లేదని అంటున్నారు. అయితే ఇప్పటికే వేణుతో కలిసి మాట్లాడాలని జగన్ చెప్పారని, కానీ అందుకు తాను సిద్ధంగా లేనని బోస్ చెప్పారు. ఖచ్చితంగా వేణుతో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని అంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు మళ్ళీ వేణుకే ఇస్తే..తాను గాని, తన తనయుడు గాని ఇండిపెడెంట్ గా పోటీ చేస్తామని బోస్ సంచలన ప్రకటన చేశారు.

దీంతో రామచంద్రాపురం రాజకీయం వేడెక్కింది. ఇక వేణుకు మళ్ళీ సీటు ఇస్తే బోస్ వ్యతిరేకంగానే ఉంటారు. అటు తోట వర్గం కూడా యాంటీగానే ఉంటుంది. దీని వల్ల రామచంద్రాపురంలో వైసీపీకే నష్టం జరిగేలా ఉంది.