బాబు బస్సు యాత్ర..టార్గెట్ అదే.!

గత కొన్ని రోజులుగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు ప్రజల్లో ఉండటం లేదు..కేవలం ఆయన పార్టీ పరమైన కార్యక్రమాలనే చూసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలకు వెళ్ళడం లేదు. గత నెలలో కుప్పంలో మూడు రోజులు పర్యటించారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్లలేరు. పార్టీ పరంగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు..పార్టీ బలోపేతంపై చర్చలు చేస్తున్నారు. అలాగే ఇంచార్జ్‌లని చోట..కొత్తగా ఇంచార్జ్‌లని నియమిస్తున్నారు. ఇలా పార్టీ పరమైన కార్యక్రమాలే చేస్తూ వచ్చారు.

అయితే జనంలో లేరు..అటు పవన్ వారాహి యాత్రతో ముందుకెళుతున్నారు. ఇటు లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఇక ఇప్పుడు బాబు కూడా ప్రజల్లోకి వస్తున్నారు. అతి త్వరలోనే బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా రూరల్ ప్రాంతాల్లోకి వెళ్ళి..అక్కడ రచ్చబండ కార్యక్రమాలు పెట్టి..బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం అవ్వడం, కార్యకర్తల ఇళ్ళలో భోజనం చేయడం, నిద్ర చేయడం చేయనున్నారు. క్రియాశీల కార్యకర్తలు, బూత్ క్లస్టర్ల పనితీరుని తెలుసుకొనున్నారు.

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పికి చాలా ముఖ్యమైనవి..ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే టి‌డి‌పి మనుగడకే ప్రమాదం..అందుకే చంద్రబాబు గట్టిగా కష్టపడుతూ..కార్యకర్తలు, నేతలని యాక్టివ్ గా ఉంచుతున్నారు. దీని ద్వారా పార్టీకి మరింత మైలేజ్ పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే లోకేష్ పాదయాత్రతో పార్టీకి ప్లస్ అవుతుంది. ఇటు నేతలు భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

ఇప్పుడు చంద్రబాబు బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇంకా చెప్పాలంటే బాబు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినట్లే. ఇక పొత్తుల విషయం మాత్రం ఎన్నికల ముందే తేల్చుకొనున్నారు.