కథానాయకుడు సినిమాలో జగపతిబాబు రోల్‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా…

కొన్ని సినిమాలు మంచి కథతో వచ్చినా థియేటర్లలో డిజాస్టర్లు అవుతుంటాయి. బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో కథానాయకుడు (2008) సినిమా ఒకటిని చెప్పవచ్చు. జగపతిబాబు హీరోగా, రజనీకాంత్ ఎక్స్‌టెంటెడ్ అతిథి పాత్రలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది కానీ బాక్సాఫీస్ పరంగా ఇది ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ హీరో అని అందరు భావించారు.

కానీ జగపతిబాబు చుట్టూనే కథ తిరుగుతూ ఉండడం వల్ల చాలా మంది దీనిని రిజెక్ట్ చేశారు. అందులోనూ ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. క్లైమాక్స్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఇది టీవీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాని టీవీలో వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు చూస్తుంటారు.

అయితే జగపతిబాబు పాత్ర మొదటగా విక్టరీ వెంకటేష్ వద్దకు వెళ్లిందట. ఎందుకంటే జగపతిబాబు పాత్ర అనేది చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించడంలో వెంకటేష్ కి తిరుగులేదు. అందుకే మేకర్స్ అతడిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు కానీ ఆ సమయంలో వెంకటేష్ వేరే ప్రాజెక్టులకు కమిట్‌ అయి చాలా బిజీగా ఉన్నాడు. అందుకే ఈ సినిమా చేయలేకపోయాడు. అందువల్ల అది మరో టాలెంటెడ్ నటుడు అయినా జగపతిబాబు వద్దకు చేరింది.

జగపతిబాబు కూడా తన పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు కానీ ఈ సినిమా అదృష్టవశాత్తు అప్పట్లో ఫ్లాప్ అయ్యింది. అయితే సినిమా క్లైమాక్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనంత ఎమోషనల్ గా ఉంటుంది. ఇలాంటి ఎమోషనల్ క్లైమాక్స్‌లో వెంకటేష్ నటించిన్నట్లయితే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేదని అభిమానులు ఇప్పటికీ అంటుంటారు. ఏది ఏమైనా ఈ మూవీ చాలామంది ప్రేక్షకుల మనసుల్లో ఫేవరెట్ గా మిగిలిపోయింది.