కాంగ్రెస్‌లోకి షర్మిల ఫిక్స్..ఏపీలోకి ఎంట్రీ ఇస్తారా?

మొత్తానికి వైఎస్ షర్మిల…కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని తేలిపోయింది. అతి త్వరలోనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని తెలుస్తుంది. ఇటీవల ఆమె చేస్తున్న రాజకీయం..అలాగే కాంగ్రెస్ లో కొందరు నేతలు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే..షర్మిల ఇంకా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయిందని తెలుస్తుంది. ఇటీవలే కే‌వి‌పి రామచంద్రారావు..విలీనంపై చర్చలు జరుగుతున్న విషయం వాస్తవమని చెప్పుకొచ్చారు. అటు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సైతం..విలీనం అంశం ఏ‌ఐ‌సి‌సి చూసుకుంటుందని అన్నారు. […]

జగన్ దూకుడు..కానీ అక్కడే తేడా కొడుతుంది.!

ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అధికార వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఇటు సి‌ఎం జగన్ సైతం రంగంలోకి దిగి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇలా కౌంటర్లు ఇవ్వడం అనేది కరెక్ట్ గానే ఉంది..కానీ ఆ కౌంటర్లు అనేవి ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే పెద్ద మైనస్ అవుతుంది. చంద్రబాబు, పవన్, లోకేష్..ఇలా నేతలు వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వారికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో వారిని వ్యక్తిగతంగా టార్గెట్ […]

రాజానగరంలో టీడీపీ సంచలనం..జనసేనకు కౌంటర్.!

ఏపీలో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందా? అంటే అది క్లారిటీ వచ్చేలా లేదు. పవన్ మాత్రం పొత్తు ఉంటుందని అంటున్నారు..కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఇటు టి‌డి‌పి పొత్తులపై మౌనంగా ఉంది. ఇక పవన్ జనసేనని బలోపేతం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో టి‌డి‌పి శ్రేణులని సైతం జనసేనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల కొత్తపేటలో కొంతమంది టి‌డి‌పి శ్రేణులు జనసేనలో చేరారు. అలాగే ఎక్కడకక్కడ ఇంచార్జ్‌లని పెట్టుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే రాజానగరంలో జనసేన ఇంచార్జ్ గా […]

కృష్ణా వైసీపీలో కొత్త అభ్యర్ధులు రెడీ..ఆ సీట్లలో చేంజ్.!

రానున్న ఎన్నికల్లో మరొకసారి గెలుపు గుర్రాలని పెట్టుకుని విజయం సాధించాలని జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో గెలిచిన అందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం అనేది కష్టం. ఎందుకంటే ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని తెలుస్తుంది. అలాంటి వారికి సీట్లు ఇవ్వనని జగన్ చెప్పేస్తున్నారు. అలాగే కొంతమంది సీనియర్లు తప్పుకుని తమ వారసులని బరిలో దింపడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమీకరణాలని చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక మార్పులు జరిగేలా ఉన్నాయి. గత […]

కమలం మళ్ళీ రేసులోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్.!

తెలంగాణలో గత కొంతకాలం నుంచి బి‌జే‌పి సైలెంట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో కీలక మార్పులు..అధ్యక్షుడుని మార్చడంతో కొంత అనిశ్చితి పరిస్తితులు నెలకొన్నాయి. అలాగే అనూహ్యంగా ఆ పార్టీ రేసులో వెనుకబడింది. ఇటు కాంగ్రెస్ ముందుకొచ్చింది. అయితే అంతకముందు బి‌జే‌పి పైకి లేవడానికి కే‌సి‌ఆర్ చేసిన రాజకీయమే కారణమని, అలా బి‌జే‌పిని పైకి లేపితే కాంగ్రెస్ తో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలుస్తుందని దాని ద్వారా బి‌ఆర్‌ఎస్ కు లాభమని విశ్లేషణలు వచ్చాయి. […]

పొత్తులపై టీడీపీ క్లారిటీ ఇదే..కమ్యూనిస్టులతోనే..!

ఏపీలో పొత్తులపై ట్విస్ట్‌లు నడుస్తూనే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో టి‌డి‌పి-బి‌జే‌పి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నాయని, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మూడు పార్టీలు కలుస్తాయని పవన్ అన్నారు. అలాగే సి‌ఎం సీటు ఎన్నికల తర్వాత తేల్చుకుంటామని అన్నారు. ఇలా పవన్ పొత్తులపై మాట్లాడిన నేపథ్యంలో టి‌డి‌పి నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ టి‌డి‌పి శ్రేణులు మాత్రం ఎవరితో ఎలాంటి పొత్తు వద్దని, బి‌జే‌పితో పొత్తు వల్ల నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు. […]

పవన్‌పై వాలంటీర్ల కేసు..జగన్ పైకి లేపుతున్నారా?

ఇటీవల ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్..వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల కోసం పనిచేయాల్సిన వాలంటీర్లు..వైసీపీ ఏజెంట్లు మాదిరిగా పనిచేస్తూ..ప్రజల పర్సనల్ డేటాని వైసీపీకి చేరవేస్తున్నారని, ఆ డేటా మొత్తం హైదరాబాద్ లోని ఓ కంపెనీలో ఉందని ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చాలామంది మహిళలు మిస్ అవుతున్నారని దానికి కారణం వాలంటీర్లు అని, ఏ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు..ఒంటరి, వితంతువు మహిళలు ఎంతమంది ఉన్నారని తెలుసుకుని, ఆ సమాచారాన్ని సంఘ […]

బెజవాడ రాజకీయం..కేశినేని వైపే బాబు.?

మామూలుగానే బెజవాడ రాజకీయం బాగా హాట్‌గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చేసింది. దీంతో అక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీ, టి‌డి‌పిలు హోరాహోరీగా ఆధిక్యం దక్కించుకోవడానికి పోరాడుతున్నాయి. అదే సమయంలో ఆయా పార్టీల్లో అంతర్గతంగా కూడా రాజకీయం నడుస్తుంది. అంటే సీట్లు దక్కించుకోవడం కోసం నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ సీటుపై రెండు పార్టీల్లో చర్చ మొదలైంది. అయితే ఇప్పటివరకు విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి ఎవరు నిలబడతారో క్లారిటీ లేదు. […]

నిమ్మలపై కొత్త ప్రత్యర్ధి..ఈ సారి అడ్డుకోగలరా?

రాజకీయాల్లో ప్రజా బలం నాయకులని ఓడించడం అసాధ్యమనే చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజా బలం ఉన్న వారిని ఓడించడం జరిగే పని కాదు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే టి‌డి‌పి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు ప్రజా బలం ఎంత ఉందో చెప్పాల్సిన పని లేదు. నిత్యం సామాన్యుడు మాదిరిగా పాలకొల్లులో ప్రజలాతో మమేకమవుతూ తిరిగే నిమ్మలకు ప్రజా మద్ధతు ఎక్కువే. అందుకే గత ఎన్నికల్లో జగన్ గాలి ఓ […]