రాజానగరంలో టీడీపీ సంచలనం..జనసేనకు కౌంటర్.!

ఏపీలో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందా? అంటే అది క్లారిటీ వచ్చేలా లేదు. పవన్ మాత్రం పొత్తు ఉంటుందని అంటున్నారు..కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఇటు టి‌డి‌పి పొత్తులపై మౌనంగా ఉంది. ఇక పవన్ జనసేనని బలోపేతం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో టి‌డి‌పి శ్రేణులని సైతం జనసేనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల కొత్తపేటలో కొంతమంది టి‌డి‌పి శ్రేణులు జనసేనలో చేరారు.

అలాగే ఎక్కడకక్కడ ఇంచార్జ్‌లని పెట్టుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే రాజానగరంలో జనసేన ఇంచార్జ్ గా బత్తుల బలరామకృష్ణని నియమించారు. అయితే రాజానగరం టి‌డి‌పికి బలమైన స్థానం. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి గెలిచింది. టి‌డి‌పి నుంచి పెందుర్తి వెంకటేష్ రెండుసార్లు గెలిచారు. 2109 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఓడిపోయాక కొన్నాళ్లు టి‌డి‌పి ఇంచార్జ్ గా పనిచేశారు. అయితే ఆయన టి‌డి‌పిని బలోపేతం చేయలేకపోవడం..అక్కడ టి‌డి‌పికి బలంగా సపోర్ట్ చేసే కమ్మ సామాజికవర్గం..వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైపు వెళుతుండటంతో ఒకటి, రెండుసార్లు వెంకటేష్‌ని పిలిపించి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు.

దీంతో అవమానంగా ఫీల్ అయ్యి వెంకటేష్ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి అక్కడ టి‌డి‌పిలో ఖాళీ ఉంది. అయితే జనసేన ఇంచార్జ్‌ని పెట్టడంతో..టి‌డి‌పి..రాజానగరం సీటు జనసేన కోసం వదిలిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా చంద్రబాబు అనూహ్యంగా రాజానగరంకు కొత్త ఇంచార్జ్‌ని పెట్టారు. పెద్దాపురంలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు పోటీగా ఉన్న  దివంగత బొడ్డు భాస్కరరామారావు తనయుడు వెంకటరమణ చౌదరీని రాజానగరం ఇంచార్జ్‌గా నియమించారు.

దీంతో పెద్దాపురంలో అంతర్గత పోరుకు బ్రేకు పడింది. అటు రాజానగరంకు కొత్త నేత వచ్చారు. ఇక మాజీ ఎమ్మెల్యే వెంకటేష్‌తో బాబు ప్రత్యేకంగా మాట్లాడి..తనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి ఇంచార్జ్‌ని పెట్టి రాజానగరంలో టి‌డి‌పి దూకుద్దు పెంచింది.