బన్నీ రేంజ్ ఈ విధాంగా మారిపోయింది ఏంటి..? అడిగి మరి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ రేంజ్.. ఓ రేంజ్ లో మారిపోయిందా..? అంటే అవును అన్న సమాధానమే మనకు వినిపిస్తుంది . పుష్ప తోనే అది సాధ్యమైంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప సినిమాతో ఓ రేంజ్ లో కుమ్మి పడేసాడు బన్నీ . త్వరలోనే పుష్ప2తో ఇండస్ట్రీని తిరగరాసే స్థాయికి మారబోతున్నాడు .

గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. కాగా రీసెంట్ గా బన్నీ కి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అల్లు అర్జున్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా లో కీలక పాత్ర కోసం ఓ హీరో సెలెక్ట్ అయినట్లు వార్త వినిపిస్తున్నాయి . అయితే ఆ హీరోనే స్వయాన త్రివిక్రమ్ కి కాల్ చేసి బన్నీ సినిమాలో నటిస్తాను అని అడిగారట .

ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఆ హీరో మరెవరో కాదు మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ . ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫాన్స్ ఓ రేంజ్ లో సంబరపడిపోతున్నారు. మా బన్నీ రేంజ్ అలాంటిది ..మోహన్ లాల్ గారే మా బన్నీ సినిమాలో నటిస్తాను అంటూ అడగడం నిజంగా గ్రేట్ అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!