పుష్ప2 తో రానా కి ఉన్న సంబంధం ఏంటి..? చంపేశావు పో సుకుమార్..!!

పుష్ప రాజ్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న అల్లు అర్జున్ తన కెరీర్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమానే ఈ పుష్ప2. ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పాటను రిలీజ్ చేశారు మేకర్స్ . పాట అద్భుతంగా అభిమానులను ఆకట్టుకుంది. ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఇలాంటి క్రమంలోనే పుష్ప రాజ్ క్యారెక్టర్ తో టాలీవుడ్ హీరో రానాకు ఉన్న సంబంధం ఏంటి అనే విషయం మారుమ్రోగిపోతుంది . పుష్ప రాజ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న బన్నీ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడట.

అయితే నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో మంచివాడిగా కనిపిస్తూనే నెగటివ్ షేడ్స్ ఎలా చూపించాడో రానా.. అదేవిధంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ చూయించబోతున్నారట . దీంతో ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. అంతేకాదు సుకుమార్ ట్వీస్ట్ లకి జనాల ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే అంటున్నారు అభిమానులు..!!