‘బాహుబలి 3’ యానిమేటెడ్ సిరీస్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందిరోయ్.. అన్నిటికన్నా హైలెట్ అదే(వీడియో)..!

రాజమౌళి .. ఈ పేరు చెప్పగానే అందరికీ మొదట గుర్తొచ్చే సినిమా బాహుబలి . దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఈ బాహుబలి. ప్రభాస్ – రానా – అనుష్క – రమ్యకృష్ణ – తమన్న లు కీలకపాత్రలో నటించి మెప్పించిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కి విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా ఎలాంటి క్రేజీ క్రేజీ రికార్డులను బద్దలు కొట్టిందో కూడా మనకు తెలిసిందే .

ఈ సినిమాకి పార్ట్ 3 రావాలి అంటూ ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకున్నారు. తాజాగా రాజమౌళి బాహుబలి 3 ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . అయితే ఇది ఓ యానిమేటెడ్ సిరీస్ అంటూ ప్రకటించారు . తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు . ఈ ట్రైలర్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది . అంతే కాదండోయ్ ఈ సిరీస్ మే 17వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుందట. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ట్రైలర్ను క్రాప్ చేశాడు రాజమౌళి.

రక్తదూత ఆయుష్మతి సింహాసానికి కట్టు బానిస అని చెప్పుకునే కట్టపనే తన సేనాధిపతిగా నియమించుకొని మాహిష్మతి రాజ్యం మీదకు దండయాత్రకు వస్తాడు .. అప్పుడు సింహాసనం కోసం బాహుబలిని ఎలా తప్పించాలా అని ఎదురుచూసే బల్లాలదేవకు తన సోదరుడు బాహుబలి తో కలిసి రక్త దూతలు ఎదిరిస్తాడా..? లేదా..? అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్ . ఈ ఆనిమేటెడ్ సిరీస్ చాలా వైవిధ్యంగా తెరకెక్కినట్లు తెలుస్తుంది . అయితే అలా దండెత్తడానికి వచ్చిన కట్టప్ప మహిష్మతికి కట్టు బానిసగా ఎలా మారాడు ..వంటి విషయాలు పూర్తిగా మనం తెలుసుకోవాలి అంటే మే 17 వరకు ఆగాల్సిందే..!