మీకు రోజు అన్నం బ్రేక్ ఫాస్ట్ గా తినే అలవాటు ఉందా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!!

సాధారణంగా దాదాపు అందరికీ బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, వడ, దోస, పూరీ లాంటిది తీసుకుంటారు. అయితే కొంతమంది మాత్రం బ్రేక్ ఫాస్ట్ లో అన్నం తింటూ ఉంటారు. టిఫిన్.. ఇడ్లీ, వడ, దోశ లాంటివి చేయలేక డైరెక్ట్ గా అన్నమే వండేసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అన్నం బ్రేక్ ఫాస్ట్ గా తిన్నటం అలవాటు చేసుకుంటారు. అయితే ఇలా బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని.. చెప్తున్నారు నిపుణులు. అయితే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం. రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్లు మీకు రోజంతటికి కావలసిన శక్తిని అందించి యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి.

7,700+ Eating Rice Close Up Stock Photos, Pictures & Royalty-Free Images -  iStock

అయితే అన్నాన్ని మరి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధిక బరువు సమస్య ఏర్పడుతుంది. రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్‌లు మీరు బరువు పెరగడానికి ప్రేరేపిస్తుంది. ఇక రైస్ లో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు డిఎన్ఏ కణజాలాన్ని దెబ్బతీసే ప్రిరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడతాయి. అలాగే ఆరోగ్యం దెబ్బ తినకుండా కాపాడతాయి. గుండె జబ్బులను కంట్రోల్ చేస్తుంది. అన్నం తినడం వల్ల హై బ్లడ్ ప్రెషర్, గుండె సమస్యల ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. బియ్యంలో విటమిన్ డి, మెగ్నీషియం, పొటాషియం లాంటి విటమిన్లు కణిజాలు సమృద్ధిగా లభిస్తాయి.

Bulgogi for Breakfast!? What Kids Eat Around the World

ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంతోపాటు.. రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాలకు చెక్ పెడుతుంది. అయితే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో బ్రౌన్ రైస్ తినడం వల్ల మాత్రం మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. దీంతో అధిక బరువుకి సులభంగా చెక్ పెట్టవచ్చు. అన్నంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక సులువుగా జీర్ణం అవుతుంది. మీరు బరువు తగ్గడానికి బ్రౌన్ రైస్ ఎంతగానో సహాయపడుతుంది. కనుక బ్రేక్ ఫాస్ట్ గా రోజు బ్రౌన్ రైస్ ను తినడం అలవాటు చేసుకుంటే మంచిది. ఎక్కువ పాలిష్ వేయని బియ్యం రోజుకు మూడుసార్లు తిన్న ఎలాంటి నష్టం కలగదు. దీని రోజు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు.