ఐటెం సాంగ్ చేయబోతున్న శ్రీముఖీ.. ఏ హీరో సినిమాలోనో తెలిస్తే ..జిల్ జిల్ జిగానే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాములమ్మగా.. సౌండ్ స్పీకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ తన లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకునిందో తెలిస్తే మాత్రం నేటి యువత షాక్ అయిపోవాల్సిందే. ఓ పక్క సినిమాలతో మరొకపక్క పలు షోస్ తో కెరియర్ను ఫుల్ బిజీబిజీగా మలుచుకునేసింది .

ఊపిరి కూడా పీల్చుకోలేనంత బిజీగా ముందుకు వెళుతున్న శ్రీముఖికి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది . ఒక స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుందట . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. శ్రీముఖి హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. పలువురు స్టార్ హీరోలకు సిస్టర్ పాత్రలో కూడా కనిపించింది .

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటం సాంగ్ చేయబోతుందట . విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు చిరంజీవి . వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు వశిష్ట . అయితే ఈ సినిమాలో శ్రీముఖి ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఆల్మోస్ట్ ఆల్ కాల్ షీట్స్ కూడా కన్ఫర్మ్ చేసేసుకున్నాడట డైరెక్టర్. దీంతో చిరంజీవి శ్రీముఖిల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!!