ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బుజ్జిది.. ఒకప్పటి సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?!

అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తూ ఫోటోకు స్టిల్ ఇస్తున్న ఈ చిన్నది ఒకప్పుడు సౌత్ ఇండియన్ షేక్ చేసిన స్టార్ హీరోయిన్. తన క్యూట్ లుక్‌, నటనతో కుర్ర కారును ఆకట్టుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎంతోమంది టాలీవుడ్ స్టార్స్ తో జతకట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎక్కువగా సినిమాల్లో మెప్పించింది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఇప్పటికి అదే క్యూట్ నెస్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇంతకీ ఈ నాటి బ్యూటీ ఇవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా డిసౌజా. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. ముంబైకి చెందిన జెనీలియా 2003లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది.

Genelia D'Souza - Wikipedia

తుజే మేరి కసం సినిమాతో రితేష్ దేశ్‌ముఖ్‌ హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన బాయ్ సినిమాతో సౌత్ లో ఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్థ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుని సౌత్ ప్రేక్షకులకు దగ్గర అయింది. కాగా ఇలియానా హీరోయిన్గా ఇంట్రీ ఇచ్చిన మొదటి తెలుగు సినిమా సత్యం కావడం విశేషం. ఈ మూవీలో అక్కినేని హీరో సుమంత్ సరసన జంటగా నటించి మెప్పించింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. దీంతో సౌత్‌లో జెనీలియా కు వరుస ఆఫర్లు క్యూ క‌ట్టాయి. ముఖ్యంగా తెలుగులో బిజీ బ్యూటీగా మారింది. ఇక‌ జెనీలియా సిద్ధార్థ్ కాంబోలో వ‌చ్చిన రెండో మూవీ బొమ్మరిల్లు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది.

Is Genelia D'Souza Pregnant? Riteish Deshmukh Reacts, 'Wouldn't Mind Having  2-3 More'

జెనీలియా కు భారీ క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. అనంతరం శీను వైట్ల డైరెక్షన్లో ఈమె నటించిన ఢీ, రెడీ సినిమాలు ఊహించిన సక్సెస్ అందుకోకపోవడంతో ఆమె గ్రేస్ కాస్త తగ్గింది. రామ్ చరణ్ కు జంటగా నటించిన ఆరెంజ్ కూడా నిరాశపరిచింది. ఇక తెలుగులో జెనీలియా చివరిగా దగ్గుపాటి రానా హీరోగా తెర‌కెక్కిన నా ఈష్టం మూవీలో న‌టించింది. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత ఆమె టాలీవుడ్‌కు దూరమైంది. తన మొదటి సినిమాలో హీరోగా నటించిన రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటికి జెనీలియా అదే క్యూట్ నెస్ తో అంతే ఫీట్ గా కనిపిస్తుంది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్ముడు.. రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలతో హిట్ అందుకుంటుంది. ప్రస్తుతం ఓ హిందీ, ఓ కన్నడ సినిమాలో న‌టిస్తూ ఆమె బిజీగా ఉంది.