ప్రభాస్ కెరియర్ లోనే ఈరోజు దరిద్రమైన “దినం”.. ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఓ పిడకల..!

సినిమా ఇండస్ట్రీలో.. స్టార్ హీరోని ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఊహించుకుంటూ ఉంటారో మనకు తెలిసిందే . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే ఇంట్లోని అమ్మా నాన్న కన్నా ఎక్కువగా ఫీల్ అయిపోతుంటారు . మా ఆరాధ్య దైవం వాళ్లే అంటూ హీరోని హీరోగా కాకుండా ఓ దేవుడిలా ఓ అన్నలా ఇంటి కుటుంబ పెద్దదిక్కులా చూస్తూ ఉంటారు . ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది.

ఏదైనా మనకు నచ్చిన స్టార్ హీరో సినిమా హిట్ అయితే ఫ్యాన్స్ ఎంత ఆనందపడతారో.. అదేవిధంగా ఫ్లాప్ అయితే ఆ సినిమాను తలుచుకొని తలుచుకొని కుమ్మిలి కుమ్మిలి బాధపడతారు. అలా ప్రభాస్ కెరియర్లో ఈరోజు మర్చిపోలేని రోజుగా అభిమానులకు ఓ పీడకలగా మారిపోయింది . దానికి కారణం ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!

“మున్న”..ఈ సినిమా పేరు చెప్పిర అభిమానుల గుండెల్లో మంట వస్తుంది. అంతలా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన సినిమా. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ నటించిన మూవీ . ప్రభాస్ కెరియర్ లోనే ఫుల్ టు ఫుల్ రివేంజ్ కమర్షియల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు ఎంతో ఇష్టంగా నిర్మించారు . 2007 మే 2వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా దరిద్రమైన టాక్ దక్కించుకుంది . అందుకే ఈ సినిమా రిలీజ్ అయిన నాదు అంటే ఫ్యాన్స్ కి ఓ పీడ కల..!