పొలిమేరా బ్యూటీకి అరుదైన గౌరవం.. ఉత్తమ నటిగా అవార్డ్ అందుకున్న కామాక్షి.. పిక్స్ వైరల్..?!

టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్లకు ఇటీవల అరుదైన గౌరవం అందింది. దేశ రాజధాని ఢిల్లీలో 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024 అవార్డుల కార్యక్రమంలో ఈమెకు ఉత్తమ నటిగా అవార్డ్ ద‌క్కింది. ఈ ఫెస్టివల్ లో ఉత్తమ నటిగా జ్యూరీ నుంచి అవార్డ్‌ను అందుకున్న కామాక్షి భాస్కర్ల ఇటీవల ఆమె నటించిన సూపర్ హిట్ మూవీ పొలిమేర 2 కి గాను ఆ అవార్డును అందుకుంటున్నట్టు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Maa Oori Polimera 2 | న‌వంబ‌ర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల‌కు సిద్ధ‌మైన `మా ఊరి పొలిమేర -2`-Namasthe Telangana

ఇందులో భాగంగా కామాక్షి మాట్లాడుతూ పొలిమర 2 లో నా నటనకు ఉత్తమ నటిగా అవార్డు రావడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించిందని.. ఈ అవార్డ్‌కు న‌న్ను ఎంపిక చేసిన జ్యూరీకి నా ధన్యవాదాలు అంటూ షేర్ చేసుకుంది. ఈ అవార్డు నట్టిగా నా బాధ్యతను మరింతగా పెంచిందంటూ వివరించింది. ఈ క్రమంలో తనకు నటన నేర్పిన గురువుగారు రత్నశేఖర్, నేజర్ కబీ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ఈ ముద్దుగుమ్మ.. నా ప్రయాణంలో మీ అందరి సపోర్ట్ కు ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ అవార్డ్ అంకితం ఇస్తున్న అంటూ వివరించింది.

Kamakshi Bhaskarla : కెరీర్ మొదట్లోనే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న హీరోయిన్.. | Actress kamakshi bhaskarla received best actress jury award from 14th dada saheb phalke film festival-10TV Telugu

కామాక్షి షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట‌ వైరల్ గా మారడంతో.. ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే డాక్టర్‌గా చదివిన పూర్తి చేసిన కామాక్షి నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. మిస్ తెలంగాణగా నిలిచిన కామాక్షి.. ఆ ఇమేజ్‌తోనే సినిమాల్లో చిన్నచిన్న అవకాశాలను అందుకుంది. ఇటీవల వచ్చిన పొలిమేర సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ బ్యూటీ.. పలు అవార్డులతో పాటు వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటుంది. ఇటీవల తెరకెక్కిన శ్రీ విష్ణు మూవీ ఓం భేమ్ బుష్ లోను ఈమె మెప్పించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.