లాస్ట్ కి సమంత-కీర్తి సురేష్ కి ఆ మగాడే దిక్కు అయ్యాడా..? భలే ఇరుకున్నేశారే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ అదేవిధంగా సమంతలకు లాస్ట్ కి ఆ స్టార్ హీరోనే లైఫ్ ఇవ్వబోతున్నాడా..?అంటే అవును అన్న ప్రచారమే జరుగుతుంది. మనకు తెలిసిందే.. కీర్తి సురేష్ – సమంత ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ . ఇద్దరు కూడా ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతూ ఉంటారు . నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత పెద్దగా ఆశాజనికంగా చెప్పుకునే ఆఫర్స్ ఏవి దక్కించుకోవడం లేదు.

అంతేకాదు కీర్తి సురేష్ -భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత తెలుగులో అంత పెద్ద హిట్ సినిమాలకు సైన్ చేయలేక పోతుంది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది . అదేవిధంగా.. సమంత కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలలో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది . అయితే ఒక కోలీవుడ్ స్టార్ హీరో అటు సమంతకి ఇటు కిర్తి సురేష్ కి సరికొత్త లైఫ్ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

ఆయన మరెవరో కాదు విజయ్ దళపతి . ఎస్ విజయ్ దళపతి 69వ సినిమాలో హీరోయిన్లుగా సమంత – కీర్తి సురేష్ నటించబోతున్నారట . ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాతోనే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుంది . అయితే కీర్తి సురేష్ ఈ సినిమా తర్వాత బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోబోతుందట. దీంతో ఈ సినిమా ఇద్దరికీ స్పెషల్ గా మారిపోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . కోలీవుడ్ ఫాన్స్ విజయ్ దళపతి ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. మొత్తానికి ఇద్దరికీ ఒకే దెబ్బతో లైఫ్ ఇవ్వబోతున్నాడు విజయ్ అంటూ ప్రశంసిస్తున్నారు..!!