9 నెలల్లో ఏకంగా 6 సినిమాలు రిలీజ్ చేసిన టాలీవుడ్ స్టార్.. ఈ స్టార్ హీరోకి పోటీ ఇచ్చే హీరో ఉన్నాడా.. ?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ హీరో నుంచి సినిమా రావాలంటే దాదాపు సంవత్సరం నడివి ప‌డుతుంది. ఇక స్టార్ హీరోలను సినిమాలైతే దాదాపు 3, 4 ఏళ్ల వరకు సమయం తీసుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలన్నీ రూ.100 కోట్లు బడ్జెట్ తో తెర‌కెక్కుతుండడంతో ఆ సినిమాల గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చవడంతో పాటు.. దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువ సమయం సినిమా కోసం కెటియించాల్సి వస్తోంది. అయితే ఒక స్టార్ హీరో మాత్రం కేవలం 9 నెలల్లో ఏకంగా ఆరు సినిమాలను రిలీజ్ చేసి రికార్డ్ సృష్టించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఆయన మరెవరో కాదు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి. తెలుగులోను పలు సినిమాల్లో నటించి మెప్పించిన మమ్ముట్టి.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు.

Mammootty - Wikipedia

రెస్ట్ లేకుండా వరుస సినిమాలో నటిస్తూ మినిమం గ్యాప్ కూడా ఇవ్వ‌కుండా సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని సినిమాలు రిలీజ్ కావడం అంటే అది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అది కూడా మమ్ముట్టి లాంటి స్టార్ హీరో ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కానూరు స్క్వాడ్, కాదల్‌ది కోర్, అబ్రహం వోస్లర్, బ్రహ్మయుగం, యాత్ర 2 సినిమాలతో వెంట వెంటనే ప్రేక్షకులను పలకరించాడు మమ్ముట్టి. త్వరలో టర్బో మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వయసు పెరుగుతున్న మరింత క్రమశిక్షణతో షూటింగ్లలో పాల్గొంటూ.. ఎక్కువ సినిమాల్లో నటిస్తూ మంచి పాపులారిటీ దక్కించుకుంటున్నాడు.

అయితే రెమ్యునరేషన్ మాత్రం లిమిటెడ్ గా తీసుకుంటూ సక్సెస్ రేట్ ను అంతకందుకు పెంచుకుంటున్నాడు ఈ మలయాళ సూపర్ స్టార్. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇలాంటి విషయాల్లో మమ్ముట్టిని చూసి నేర్చుకోవాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మమ్ముట్టి సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందుతుండడం విశేషం. ఆయన ఎంచుకుంటున్న కంటెంట్ విషయంలోనూ.. ప్రాజెక్ట్స్ విషయంలోను ప్రేక్షకుల నుంచి ఎప్పటికప్పుడు ప్రశంసలు అందుకుంటున్నాడు మమ్ముట్టి. ఆయన్ను అభిమానించే అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.