“ఆ విషయంలో మిస్టేక్ నాదే”..ఇన్నాళ్లకి తప్పు ఒప్పుకున్న నాగచైతన్య..!

ఏంటో ..పాపం నాగచైతన్య ఎప్పుడెప్పుడు మంచివాడు అనిపించుకుంటాడో.. అప్పుడే ఆయనకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం లేదా ట్రోలింగ్కి గురవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నాగచైతన్యకు సంబంధించి ఎలాంటి పాజిటివ్ వార్తలు విన్నామో..మనం చూసాం. దూత వెబ్ సిరీస్ హిట్ అవడం ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ పలు సినిమాలలో నటిస్తూ కొన్ని క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేయడం నాగచైతన్య కెరీర్ కు ప్లస్ పాయింట్ లుగా మారుతున్నాయి అంటూ జనాలు చెప్పుకొచ్చారు .

అయితే ఇలాంటి మూమెంట్లోనే పాత తాలూకా వీడియోను ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు . ఆ వీడియోలో ఆయన నేను రిలేషన్షిప్ లో మోసం చేశాను అని చెప్పుకు రావడం గమనార్హం . అయితే అది సమంతనే అంటూ జనాలు ప్రచారం చేస్తున్నారు . కానీ ఆ వీడియోలో నాగచైతన్య మాట్లాడినది శైలజ రెడ్డి అల్లుడు సినిమా ప్రమోషన్స్ టైం లో.. ఆ టైంలో నాగచైతన్య సమంత కలిసే ఉన్నారుగా . మరి ఎందుకు నాగచైతన్య – సమంతను చీట్ చేస్తాడు ..? అంటూ అక్కినేని ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్ వేస్తున్నారు . మొత్తానికి ఎవరో పనీపాటా లేని బ్యాచ్ నాగచైతన్య పై ట్రోలింగ్ చేయడానికి ఎప్పుడెప్పుడు ఏ వీడియో బయటపడుతుందని కాచుకొని కూర్చొని ఉన్నారు అని చెప్పడానికి ఇదే ది బెస్ట్ ఉదాహరణ.


ప్రజెంట్ నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అంతేకాదు విరుపాక్ష సినిమా డైరెక్టర్ తో కూడా ఒక క్రేజీ ప్రాజెక్టు ఫైనలైజ్ చేసాడట . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే చూస్ చేసుకున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది..!!