కోలీవుడ్ ఇండస్ట్రీలో అలా చేసిన ఫస్ట్ హీరోయిన్ ఈమె.. ఎవరో గుర్తు పట్టారా..!

కొంతమంది హీరోయిన్స్ కేవలం అందం పరంగానే కాదు.. నటన పరంగా కూడా క్రేజీ క్రేజీ రికార్డును క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్లు దూరంగా ఉన్నా సరే ఆ హీరోయిన్స్ ని జనాలు ఎప్పుడూ ఆదరిస్తూ..వాళ్లు నటించిన సినిమాలను ఆనందంగా చూస్తూ ఉంటారు .ఆ లిస్ట్ లోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ శ్రేయ శరణ్. ఇష్టం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది .

అంతేకాదు తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకుంది . అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల సినిమాకు నాంది పలికింది శ్రేయ శరణ్ మూవీతో అనే చెప్పాలి. అప్పటివరకు కోలీవుడ్ ఇండస్ట్రీ అంటే కేవలం సినిమాలు తెరకెక్కిస్తారు ..బాగుంటాయి ..నాచురల్ గా ఉంటాయి. అంతవరకే అనుకునేవారు. కానీ ఆ సినిమాలో కూడా 100 కోట్లు క్రాస్ చేస్తాయని ప్రూవ్ చేసింది ఒక సినిమా .

ఆ సినిమా మరేదో కాదు “శివాజీ” . రజనీకాంత్ హీరోగా శ్రేయ శరణ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం 100 కోట్లు క్రాస్ చేసిన మూవీ గా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకి రజినీకాంత్ స్టైల్ ఎంత ప్లస్ అయిందో శ్రేయ శరణ్ అందాలు కూడా అంతే ప్ల అయ్యాయి . అది అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకానొక టైం లో సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడానికి కారణం శ్రేయ శరణ్.. అని అంటూ కూడా ఆమె అభిమానులు ఓ రేంజ్ లో పొగిడేసారు..!!