రజనీకాంత్ ‘ కూలి ‘ టీంకు ఇళయరాజా నోటీసులు.. ఏం జరిగిందంటే..?!

లోకేష్ కనగ‌రాజ్‌ డైరెక్షన్‌లో రజినీకాంత్ కూలీ టైటిల్ తో సినిమా వ‌చ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి అయినా రాలేదు. అప్పుడే మేకర్స్ కు పెద్ద షాక్ తగిలింది. రజిని, లోకేష్ ఇద్దరు సూపర్‌ స్టార్ సెలబ్రిటీస్ కావడంతో వీరిద్దరి కాంబోలో వ‌స్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీని గ్రాండ్ లెవెల్ లో అనౌన్స్ చేశారు. ఆ టైంలో రిలీజ్ చేసిన ఈ టీజర్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ లో రజనీకాంత్ బంగారం తో నిండిన ఓ డెన్లో అడుగుపెట్టి అక్కడ ఉన్న రౌడీలను ఆడేసుకుంటాడు.

Thalaivar 171 Title Controversy: Lokesh Kanagaraj and Rajinikanth In  Conflict For

గోల్డ్ స్మగ్లింగ్ చేసే రౌడీలను బంగారు గడియారాలతో.. ఒక గొలుసులాగా తయారు చేసి చితక బాధితాడు అయితే ఈ ఫైట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ వీడియోలో మేకర్స్ రెండు పాటలను కూడా వాడారు. నేనైతలే సినిమాలో శంభో శివశంభో పాట లిరిక్స్ ను అలాగే.. తగన్ మగన్ మూవీలో వావా పక్కాంవా పాట మ్యూజిక్ను ఉపయోగించారు. అయితే అందులో ఓ పాట ఇప్పుడు మేకర్స్ కు తంటాలు తెచ్చి పెట్టింది. నా పాట‌ను ప‌ర్మిష‌న్ లేకుండా వాడుకున్నారు అంటూ ఇళయరాజా.. కూలీ డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూసర్లకు లీగల్ నోటీసులు పంపాడు. కూలి మూవీ టీజర్ లో వినిపించిన మ్యూజిక్ అంత అనిరుధ్ త‌న‌ సొంతంగా కంపోజ్‌ చేయగా.. వావా వ‌క్కాం వా అనే ఒక సాంగ్ మాత్రం రజనీకాంత్ హీరోగా 1983లో రిలీజైన తగన్ మగన్ సినిమాలో సాంగ్.

Rajinikanth's 'Coolie': Lokesh Kanagaraj's Latest Directorial Venture  Unveiled

ది మాస్ట్రో ఇళయరాజా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్ కంపోజర్ గా వ్యవహరించారు. తన అనుమతి లేకుండా పాటను కూలి దర్శక నిర్మాతలు వాడుకున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కాపీరైట్స్ హక్కులను ఉల్లంఘించిన కేసులో లీగల్ నోటీసులు జారీ చేశారు. కూలీ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ బ్యానర్ కు ఇళయరాజా నోటీసులు అందాయి. స్పందించకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ ఆయన వివరించాడు. సరైన అనుమతులు తీసుకోవాలని.. లేదంటే టీజర్ నుంచి మ్యూజిక్ వెంటనే తొలగించమంటూ డిమాండ్ చేశారు.

Ilaiyaraaja discography - Wikipedia

సాధారణంగా ఏ సినిమాలో అయినా పాత మూవీ సాంగ్స్ వాడితే ఆ సంగీత దర్శకులు అనుమతి తీసుకోవాలి. అలాగే వారికి రాయలటీ కూడా ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఇళ‌య‌రాజతో కూలి మేకర్స్ కు ఏర్పడిన ఇష్యుని కూడా రాయలటీతో పరిష్కరించుకుంటారని వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. అయితే గతంలో కూడా లోకేష్ కనగ‌రాజ్‌ తన సినిమాల్లో కొన్ని పాత సినిమాల పాటలను వాడారు. వాటిలో ఇళయరాజా ట్యూన్స్ కూడా ఉన్నాయి. తానే స్వయంగా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఫైట్ క్లబ్.. అలాగే దర్శకత్వం వహించిన విక్రమ్ మూవీ టైటిల్ ట్రాక్ లోను ఇళయరాజా ట్యూన్స్ ను వాడారు. కాగా కేవలం కూలీ సినిమా విషయంలోనే ఇళయరాజా కేసు వేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.