వాట్.. డైరెక్టర్ సుకుమార్ కూతురు ఓ సినిమాలో నటించిందా.. ఆ మూవీ ఏంటంటే..?!

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో మొద‌టి వ‌రుస‌లో సుకుమార్ పేరు కూడా వినిపిస్తుంది. ఆర్యతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్.. పుష్ప మూవీ తో పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్‌ అందుకున్న మొదటి హీరోగా బన్నీ రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో మంచి అంచనాలను నెలకొన్నాయి.

Sukumar Age, Girlfriend, Wife, Children, Family, Biography & More » StarsUnfolded

కాగా సుకుమార్ కు ఒక కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు సుకృతి వేణి. తాజాగా సుకృతి వేణికి అత్యున్నత పురస్కారం అందింది. గాంధీ తాత చెట్టు అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది ఈ అమ్మడు. ఈ మూవీలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. దీంతో ఉత్తమ బాలనటిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది ఈ చిన్నది. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో సుకృతి తన తల్లి సభితాతో కలిసి పాల్గొంది. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుకుంటున్న సుకృతి.. గాంధీ తాత చెట్టు మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడం జరిగింది.

Sukumar's daughter Sukriti wins award for 'Gandhi Thatha Chettu'

ఇందులో సుకృతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు ఈ సినిమాతో ఆమెకు ఎన్నో అవార్డులు దక్కాయి. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో రూపొందిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీ సంస్థలు సంయుక్తంగా తెర‌కెక్కించాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇండియన్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో ఉత్తమ బాలునట్టిగా సుకృతి అవార్డులు దక్కించుకుంది. వీటితో పాటే పలు ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ లో స్థానాన్ని అందుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి.