వార్నీ..‘పుష్ప’ టైటిల్ సాంగ్ కి స్టెప్పులు కంపోజ్ చేసింది ఆయనా..? డాన్స్ మాస్టర్ ఎవరో తెలుసా?

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పుష్ప – పుష్ప – పుష్ప అంటూ ఓ పాట మారుమ్రోగిపోతుంది . అది ఏ సినిమాలో కూడా మనకు తెలుసు . పుష్ప2 సినిమాలోని టైటిల్ సాంగ్ . రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలోని టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ పాటకు ఎంత క్రేజ్ లభించిందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా చంద్రబోస్ లిరిక్స్ ఈ పాటకి హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాకి సంబంధించిన లిరికల్ సాంగ్ నిన్న సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు చిత్ర మేకర్స్ రిలీజ్ చేశారు .

కాగా పుష్ప2 టైటిల్ సాంగ్ లో షూ వదిలేసి వేసే స్టెప్ బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు జనాలు ఈ స్టెప్స్ పై స్పెషల్ ఫోకస్ చేశారు . ఈ క్రమంలోనే అసలు ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన మాస్టర్ ఎవరు అనే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే అల్లు అర్జున్ ఎంత కష్టమైనా స్టెప్స్ అవలీలగా వేసేయగలడు. మరి ఇలాంటి స్టెప్స్ కూడా డిజైన్ చేయించే కొరియోగ్రాఫర్ మన ఇండస్ట్రీలో ఉన్నారా..? అని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది .

నిజానికి పుష్ప 2 సినిమాకు డాన్స్ మాస్టర్స్ గా ప్రేమ్ రక్షిత్ – గణేష్ ఆచార్య – విజయ్ పోలాకి – శ్రేష్టి ఉన్నారు . కానీ పర్టికులర్గా ఈ టైటిల్ సాంగ్ లోని షూస్ స్టెప్ కంపోజ్ చేసింది మాత్రం విజయ్ పోలాకి అనే మాస్టర్ పేరు బయటపడింది. ఈ మధ్యకాలంలో ఈ పేరు బాగా ఫామ్ లోకి వచ్చింది. బేబీ – మ్యాడ్ – బబుల్ గమ్ – హాయ్ నాన్న సినిమాలలో గుర్తుండిపోయే స్టెప్స్ వేయించాడు . రీసెంట్గా అల్లు అర్జున్ తో వెరీ వెరీ ఫన్నీ నాటి స్టెప్స్ వేయించాడు. దీంతో సోషల్ మీడియాలో ఈయన పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!