“ఓరి వెధవల్లారా.. అది అంతా సెక్స్ కోసమే రా”.. టూ బోల్డ్ గా వివరించిన పూరీ జగన్నాధ్..!

ఎస్ ప్రెసెంట్ .. పూరి జగన్నాథ్ కి సంబంధించిన ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో అదేవిధంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . పూరి జగన్నాథ్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నెన్ని మంచి సినిమాలను తెరకెక్కించి ఎంతమంది హీరోలకి లైఫ్ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఒకటారండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో .. ఎంతోమంది స్టార్స్ ను స్టార్ హీరోలుగా మార్చిన ఘనత పూరి జగన్నాద్ కే దక్కుతుంది . ప్రజెంట్ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన క్రేజ్ పడిపోయింది .

కానీ ఒకప్పుడు మాత్రం ఓ రేంజ్ లో పూరి జగన్నాథ్ పేరు చెప్తే అరుపులు వినిపించేటివి. తాజాగా పూరి జగన్నాథ్ యూట్యూబ్ లో లవ్ ఫెయిల్యూర్ అనే వీడియో చేశాడు . ఈ వీడియోలో ఆయన పచ్చిగా నేటి యువత దేనికోసం పాకులాడుతుందో ..?అసలు యువత దృష్టిలో ప్రేమంటే ఏందో..? అనే విషయాన్ని ఓపెన్ గా చెప్పేసాడు . ఆయన మాట్లాడుతూ..” చాలామంది ప్రేమ అనే మత్తులో మునిగిపోతూ ఉంటారు . ప్రేమ కోసం ఏవేవో చేసేస్తూ ఉంటారు . ప్రేమలో విఫలమైతే అన్నం తినరు .. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు .. మరి కొంతమంది తిండి నిద్ర మానేసి దేనికోసమో పరితపిస్తూ ఉంటారు .. అయితే వాళ్ళు అనుకున్నట్టు అది ప్రేమ కాదు .. అది కేవలం సెక్స్ కోసం మాత్రమే వినడానికి కొంచెం ఘాటుగా ఉన్న ఇదే నిజం “..

“జీవితంలో చాలా మంది ప్రేమ అనే మత్తులో ఇదే తప్పు చేస్తూ ఉంటారు . నిజమైన ప్రేమ తల్లిది నీ తల్లి కోసం ఏనాడైనా చేయి కోసుకుంటావా..? ఏనాడైనా తిండి మానేసావా..? ఆ అమ్మాయి నీకు దక్కలేదు అన్న ఈగోలో వచ్చిన ఉక్రోసమే అది.. ప్రేమ కానే కాదు .. నీ ఈగో ఎంత ఉంటే నువ్వు అంత నరకం చూస్తావ్ .. కేవలం సెక్స్ కోసం మాత్రమే అమ్మాయిని ప్రేమిస్తావ్” అంటూ పచ్చిగా ఉన్న విషయాలను బోల్డ్ గా చెప్పేసాడు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . పూరి జగన్నాథ్ చెప్పిన మాటలు నిజమే అంటున్నారు సినీ పెద్దలు. అంతేకాదు పూరి జగన్నాథ్ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!