‘ పుష్ప2 ‘ సాంగ్ లో బన్నీ చేతిలో గాజు గ్లాస్.. చిన్న మామకు బన్నీ ప్రచారం అంటూ..?!

అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వ‌స్తున్న మూవీ పుష్ప 2. పుష్పాకు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 15న‌ రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మెల్లమెల్లగా మొదలుపెట్టారు మేకర్స్. పుష్ప2 నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజై రచ్చ రచ్చ చేస్తుంది. పుష్ప పుష్ప.. అంటూ సాగే పాట లో పుష్ప రాజ్ క్యారెక్టర్, యాటిట్యూడ్, డిఫరెంట్ స్టైల్ తో చూపించే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సుకుమార్. అయితే ఈ సాంగ్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరిగింది. ఈ సాంగ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రచారంలో బన్నీ ఫుల్ సపోర్ట్ ను ఇచ్చాడంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నాడు. ఇక పవర్ స్టార్.. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఇప్పటికే పవన్ తో పాటు అయిన తరపున ఎంతో మంది అభ్యర్థులు నిలబడి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన పుష్పరాజ్ సాంగ్ తో బన్నీ కూడా గాజు గ్లాస్ కు గట్టిగా సపోర్ట్ చేశాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాంగ్లో గాజు గ్లాస్ టీ తో రచ్చ రచ్చ చేశాడు అల్లు అర్జున్. గాజు గ్లాసు క్లోజ్ షాట్స్‌తో చాలా సేపు చూపించారు. బన్నీ కూడా తన మేనరిజం తో గాజు గ్లాస్ తీసుకొని అందులో టీ తాగుతూ బిస్కెట్ తింటూ కనిపించాడు. అయితే ఈ సాంగ్ లో గాజు గ్లాస్ షాట్స్ బాగా క్లోజ్ చేసి ఎక్కువగా వాడారు.

Pushpa Pushpa': Allu Arjun returns with the 'Thaggedhe Le' swag in first  single from 'Pushpa 2' - The Hindu

అలాగే ఈ గాజు గ్లాస్ షార్ట్స్ అయిన వెంటనే బ‌న్ని తగ్గేదేలే అంటూ పవర్ ఫుల్ గా డైలాగ్ చెప్పాడు. దీంతో పవర్ స్టార్ కు తన ఫుల్ సపోర్ట్ను బన్నీ ఇచ్చాడు అంటూ.. ఎన్నికల ప్రచారం కోసమే ఆ సీన్స్ ను అంత హైలెట్ చేశారంటూ ఎన్నికల్లో చిన్న మామ తగ్గేదేలే అంటూ సింబాలిక్‌గా బ‌న్నీ చూపించాడంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పవర్ స్టార్ తరుపున ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే వైష్ణవి తేజ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. త్వరలోనే మెగాస్టార్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతాడు అంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బన్నీ చిన్న మామకు పరోక్షంగా పాటతో ప్రచారం చేశాడంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.