హీరో విశ్వక్ సేన్ కౌంటర్ బేబీ సినిమా గురించేనా..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు.. తనకు నటించడమే కాకుండా డైరెక్షన్ బాధ్యతలు కూడా పూర్తిగా చేయగల సత్తా ఉన్న హీరో..తాను నటించిన రెండు చిత్రాలకు ఆయన స్వయంగా దర్శకత్వం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆ రెండు సినిమాలు కూడా హిట్ కాకపోయినా డైరెక్టర్గా మాత్రం అందరికీ దగ్గరయ్యారు.. ఇటీవలే దాస్ కా దమ్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఇందులో రెండు విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు.

Vishwak Sen Wiki, Biography, Age, Wife, Family & Movies

ప్రస్తుతం విశ్వక్ చేతిలో రెండు మూడు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వక్ కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో పలు రకాల ట్వీట్లు చేస్తూ తరచు వార్తలలో నిలుస్తూనే ఉంటారు. తనకు నచ్చిన విషయాలు నచ్చని విషయాలను కూడా ఎప్పుడు తెలియజేస్తూ ఉంటారు.. తాజాగా ఇప్పుడు మరొక ట్విట్ చేయడం జరిగింది.. అదేమిటంటే ఆయన చేసిన ట్వీట్ ఏమిటనే విషయాన్నికి వస్తే..”నో అంటే నో అనేది మగవాళ్లకు కూడా వర్తిస్తుంది.. అందుకే ప్రశాంతంగా కూల్ గా ఉండండి ప్రశాంతతను పంచుకోండి రిలాక్స్ అవ్వండి అంటూ ట్విట్ చేశారు”.

అసలు విశ్వక్ ఈ టిట్టు ఎందుకు చేశారని అభిమానులు ఆలోచిస్తున్నారు అసలు ఏదీ లేకుండా ఆయన ఈ ట్విట్ చేయడు కదా ఏదో జరిగింది అంటూ ఆరా తీయగా ఈ క్రమంలోని ఒక వార్త వైరల్ గా మారుతోంది.. ఇటీవల బేబీ సినిమా విడుదలే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసింది ఈ సినిమా సక్సెస్ మీట్ లో సాయి రాజేష్ ఒక మాట అన్నారు తాను హృదయ కాలేయం సినిమా తీసిన డైరెక్టర్ అని తనతో సినిమా చేయడానికి ఒక హీరో నిరాకరించారు అంటూ కామెంట్లు చేశారు.. కథ కూడా వినలేదు అంటూ తెలిపారు.. ఇక ఈ హీరో ఎవరా అని ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు తాజాగా విశ్వక్ ఒక ట్విట్ చేయడం జరిగింది..ఆ హీరో ఇతనేనా అంటూ పలువురు నిటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా బేబీ సినిమాకి వచ్చిన రచ్చనా అంటూ మరి కొంతమంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.