ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నిల్ అదిరిపోయే అప్డేట్.. అది చెప్పి షాక్ ఇచ్చాడుగా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్.. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీలో నటిస్తున్నాడు తారక్‌.

Epic Backstory For 'Devara' Loading! | Epic Backstory For Devara Loading

ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి భాగం దసరా కానుకగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అక్టోబర్ 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్ లోను అవకాశాలను అందుకుంటున్నాడు తారక్. ప్రస్తుతం ఈయన బాలీవుడ్ లో వార్2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు. కాగా ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.

Jr NTR sports fierce look in Prashanth Neel's NTR 31 - India Today

తాజాగా ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఆ మేటర్ తెలిసిన ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్, ఎన్టీఆర్ కాంబోలో రాబోయే ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభించినుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా ఎప్పుడు లేని విధంగా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారట మూవీ టీం. ప్రస్తుతం ఈ న్యూస్ మరింత వైరల్‌గా మారడంతో.. ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ వివరాలు అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారట.