విశాఖ పార్ల‌మెంటు: బొత్స ఝాన్సీ నైతికంగా గెలిచేసిన‌ట్టే..?

విశాఖ పట్నం పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌తీమ‌ణి, మాజీ ఎంపీ.. బొత్స ఝాన్సీ ప‌రిస్థితి ఎలా ఉంది? ఆమె గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మేనే.. అంటే.. నైతికంగా అయితే.. ఆమె ఇప్ప‌టికే విజ‌యం ద‌క్కించుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు వెల్ల‌డిస్తున్నారు. 1) బొత్స ఝాన్సీ మంచిత‌నం. 2) తొలిసారి తూర్పు కాపుల‌కు ఇక్క‌డ అవ‌కాశం ఇవ్వ‌డం 3) విశాఖ‌ను రాజ‌ధానిని చేస్తామ‌న్న వైసీపీ వాగ్దానం. ఈ మూడు కూడా.. ఇక్క‌డ బొత్స ఝాన్సీకి మెండైన అవ‌కాశాలు ఇస్తున్నాయ‌ని పొలిటిక‌ల్ టాక్‌.

1) బొత్స ఝాన్సీ మంచిత‌నం..
ఈ విష‌యాన్ని తీసుకుంటే.. ఆమె దాదాపు పాతిక సంవ‌త్స‌రాలుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్‌గా ప్రారంభించిన ఝాన్సీ రాజ‌కీయం.. త‌ర్వాత ఎంపీ స్థాయికి ఎదిగింది. అయితే.. ఇక్క‌డ చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండే త‌త్వం. ఈ విష‌యంలో ఝాన్సీని కొట్టిన వారులేరు. ఇంకా చెప్పాలంటే ఎవ‌రైనా ప‌నికోసం బొత్స ద‌గ్గ‌ర‌కు వెళ్లి ప‌ని కాక‌పోతే ఝాన్సీ ద‌గ్గ‌ర‌కు వెళితే ఆ ప‌ని ఈజీగా అవుతుంద‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బ‌లంగా వినిపించే మౌత్ టాక్ ? తాను ఎంత పెద్ద ప‌ద‌విలో ఉన్నాన‌నే విష‌యాన్ని ఆమె ప‌ట్టించుకోరు. ఆమె భ‌ర్త స‌త్య‌నారాయ‌ణ మంత్రిగా ఉన్నార‌నే వాద‌న‌ను కూడా ఆమె అంగీక‌రించ‌రు. సామాన్య కుటుంబంగానే ఆమె భావిస్తారు. ప్ర‌జ‌ల‌కు చేరువగా ఉంటారు. ఇది ఆమెకు నైతిక విజ‌యాన్ని అందించింది.

2) తూర్పు కాపులు..
బొత్స కుటుంబం తూర్పు కాపుల‌నే విష‌యం తెలిసిందే. నిజానికి విశాఖ‌ప‌ట్నం ఎంపీ స్థానాన్నిఇప్ప‌టి వ‌ర‌కు కాపుల‌కు ఏపార్టీ కూడా ఇవ్వ‌లేదు. గ‌తంలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం.. త‌ర్వాత క‌మ్మ సామాజిక వ‌ర్గాలే.. ఇక్క‌డ వ‌రుస గా గెలుస్తున్నాయి. కానీ.. నియోజ‌క‌వ‌ర్గంలో సామాజిక వ‌ర్గాల ప‌రంగా చూసుకుంటే.. కాపులు ఎక్కువ‌గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో నే వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ ఇక్క‌డ తొలిసారి కాపుల‌కు అవ‌కాశం ఇస్తూ.. అది కూడా మ‌హిళ‌ల‌కు ఛాన్స్ ఇచ్చారు. దీంతో బొత్స ఝాన్సీ.. నైతికంగా గెలిచార‌న‌డంలో సందేహం లేదు. మ‌రో విష‌యం ఏంటంటే ఇక్క‌డ కొన్ని ద‌శాబ్దాలుగా నాన్ లోక‌ల్ వ్య‌క్తులే ఎంపీలు అవుతున్నారు. కానీ ఝాన్సీ పుట్టింది పెరిగింది విశాఖ‌లోనే.. ఇది కూడా ఆమెకు చాలా ఎడ్వాంటేజ్ అవుతోంది.

3) వైసీపీ అభివృద్ధి:
విశాఖ‌ను రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. వైసీపీ ప్ర‌భుత్వం గ‌త మూడేళ్ల‌లో ఇక్క‌డే ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాలాడెవ‌ల‌ప్ చేసింది. ప‌ర్యాట‌కంగా, పారిశ్రామికంగా కూడా.. ఈ న‌గ‌రాన్ని అబివృద్ధి చేయడం.. వైసీపీ ప‌రంగా బొత్స ఝాన్సీకి క‌లిసి వ‌స్తున్న ప్ర‌ధాన అంశం. వీటితోపాటు.. ప్ర‌తిప‌క్షం నుంచి రంగంలో ఉన్న శ్రీభ‌ర‌త్ అతివిశ్వాసంతో ఉన్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో బొత్స ఝాన్సీ విజ‌యం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.