విజయదశమి నుంచి విశాఖలో పాలన… సాధ్యమేనా….!?

నేటికి నాలుగు సంవత్సరాల నుంచి వింటున్న మాట… ఏ క్షణంలో అయినా విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని …. దసరా, సంక్రాంతి , ఉగాది వంటి పండుగలు ప్రతి ఏడాది వస్తూనే ఉన్నాయి. కానీ మళ్లీ తాజా ముహుర్తం వచ్చే నెల 23న ఫిక్స్ అయింది. విజయదశమి నుంచి పాలన విశాఖ నుంచి ప్రారంభమవుతుందని క్యాబినెట్ మీటింగ్‌లో సిఎం చెప్పినట్టు మంత్రులు ప్రచారం చేశారు. వచ్చే నెల అంటే అక్టోబర్ 23వ తేదీన తెలుగువారికి ప్రీతిపాత్రమైన విజయదశమి […]

విశాఖలో ఎవరి బలమెంత? ఆధిక్యం ఎటువైపు?

అతి త్వరలో జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. దసరా నాటికి జగన్ విశాఖలో కాపురం పెడతానని చెప్పారు. అప్పటినుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుంది. అంటే విశాఖ పరిపాలన రాజధాని కాబోతుంది. దీంతో విశాఖపై వైసీపీకి రాజకీయంగా కూడా పట్టు దొరుకుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటేసింది. ఇప్పటివరకు ఆ దిశగా పనులు జరగలేదు. ఇప్పుడు […]

విశాఖ రాజకీయం..బాబు-పవన్ టార్గెట్ క్లియర్ కట్.!

అతి త్వరలోనే జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ దసరాకు విశాఖలో కాపురం పెడతానని చెప్పుకొస్తున్నారు. ఇక జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టి..రాజధాని ఏర్పాట్లు ముమ్మరం అయితే..విశాఖలో వైసీపీకి రాజకీయంగా కలిసొస్తుంది. ఆ ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా పడుతుంది. ఇది వైసీపీకి అడ్వాంటేజ్. ఈ నేపథ్యంలో వైసీపీని నిలువరించడానికి చంద్రబాబు, పవన్ గట్టిగానే కష్టపడుతున్నారు. విశాఖ వేదికగా రాజకీయ వేడి రగులుస్తున్నారు. ఇప్పటికే పవన్ విశాఖలో వారాహి మూడో విడత యాత్ర […]

విశాఖపైనే పవన్ గురి.. వైసీపీకి రిస్క్ పెంచుతారా?

పవన్ కల్యాణ్ వారాహి మూడో విడత యాత్రని విశాఖలో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. విశాఖ జగదాంబ సెంటర్ లో భారీ సభ నిర్వహించారు. తర్వాత రిషికొండకు వెళ్ళి..అక్కడ సి‌ఎం క్యాంప్ ఆఫీసు నిర్మాణాలని పరిశీలించారు. ఇక వరుసగా విశాఖలో పవన్ పర్యటించనున్నారు. రోడ్ షోలు, భారీ సభలు ఏర్పాటు చేయనున్నారు. టోటల్ గా విశాఖపైనే పవన్ గురి పెట్టారు. దసరాకు జగన్ విశాఖ నుంచే పాలన మొదలుపెడుతున్న నేపథ్యంలో పవన్..విశాఖలో పర్యటించడం చర్చనీయాంశమైంది. అక్కడ వైసీపీకి చెక్ […]

విశాఖపై జగన్ ఫోకస్..వైసీపీకి ప్లస్.!

విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి..జగన్ అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ చేసి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకోస్తున్న విషయం తెలిసిందే. విశాఖని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎలాగో సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపై మరింత శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో విశాఖ నుంచి కంపెనీలని తరిమేశారని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా జగన్..కొత్తగా విశాఖకు […]

విశాఖ వైసీపీలో ట్విస్ట్‌లు..సీటుతో అధ్యక్షుడు.!

ఎప్పుడైతే విశాఖని పరిపాలన రాజధాని అని చెప్పారో..అప్పటినుంచే విశాఖలో రాజకీయంగా వైసీపీకి కలిసిరావడం లేదు. రాజధాని పేరుతో అక్కడ వైసీపీ అన్నీ అక్రమాలకే పాల్పడుతుందనే విమర్శలు వచ్చాయి. ఇక అక్కడి ప్రజలు వైసీపీపై ఆగ్రహంగానే ఉన్నారు. జగన్ విశాఖలో కాపురం పెడతానని అంటున్న అక్కడి ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో టి‌డి‌పి బలపడటం..జనసేనతో పొత్తు ఇంకా ప్లస్ అవ్వడంతో వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. […]

వైసీపీలో లొల్లి..టీడీపీ ఎమ్మెల్యేకు సెగలు..!

ఏపీలో అధికార వైసీపీలో అంతర్గత పోరు తారస్థాయిలో జరుగుతుందనే చెప్పాలి. పెద్ద ఎత్తున సీటు విషయంలో రచ్చ నడుస్తుంది. దీంతో పెద్ద పంచాయితీలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో టి‌డి‌పి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే ఉన్నచోట పెద్ద తలనొప్పి ఉంది. ముఖ్యంగా విశాఖ సౌత్ అసెంబ్లీలో పెద్ద రచ్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి టి‌డి‌పి తరుపున వాసుపల్లి గణేశ్ గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి జంప్ చేశారు. ఇక అక్కడ […]

విశాఖ వైసీపీలో లొల్లి..సీట్ల తగాదా.!

అధికార వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ పోరు నడుస్తుంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పంచాయితీ పెద్దగానే ఉంది. ఇదే క్రమంలో విశాఖలో సైతం నేతల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తుంది. విశాఖ నగరంలో ప్రతి సీటులోనూ ఆధిపత్య పోరు. విశాఖ తూర్పు స్థానంలో పలువురు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా వంశీకృష్ణ, అక్రమాని విజయనిర్మల మధ్య పంచాయితీ ఉంది. ఇటు టి‌డి‌పి […]

విశాఖలో కాపురం..ఉత్తరాంధ్ర కలిసొచ్చేలా లేదుగా.!

మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ మూడేళ్ళ క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు ఒక్క రాజధానికే దిక్కు లేదనే పరిస్తితి. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అనే తెలియనే పరిస్తితి. అలా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయింది. అయితే త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలుపెడతామని, అదే ఏపీ రాజధాని అని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. ఈ మాట చాలా రోజులు నుంచి చెబుతున్నారు. సి‌ఎం జగన్ సైతం పదే పదే […]