వైసీపీలో లొల్లి..టీడీపీ ఎమ్మెల్యేకు సెగలు..!

ఏపీలో అధికార వైసీపీలో అంతర్గత పోరు తారస్థాయిలో జరుగుతుందనే చెప్పాలి. పెద్ద ఎత్తున సీటు విషయంలో రచ్చ నడుస్తుంది. దీంతో పెద్ద పంచాయితీలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో టి‌డి‌పి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే ఉన్నచోట పెద్ద తలనొప్పి ఉంది. ముఖ్యంగా విశాఖ సౌత్ అసెంబ్లీలో పెద్ద రచ్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి టి‌డి‌పి తరుపున వాసుపల్లి గణేశ్ గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి జంప్ చేశారు. ఇక అక్కడ ఎమ్మెల్యే వాసుపల్లికి..ముందు నుంచి వైసీపీ నేతలకు పడటం లేదు.

పెద్ద రచ్చ నడుస్తుంది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇప్పటికే రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయింది. సీటు కోసం పంచాయితీ నడుస్తుంది. తాజాగా నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటుచేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.  ఇక వాసుపల్లి తనతో పాటు టి‌డి‌పి నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళుతున్నారు. ఇది మొదట నుంచి వైసీపీలో ఉన్న వారికి నచ్చడం లేదు. వీరంతా సీతంరాజు వైపుకు వచ్చారు.

ఇక ఇద్దరు నియోజకవర్గంలో వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతుండడంతో వైసీపీ కార్పొరేటర్లు, నేతలు అయోమయంలో పడ్డారు. వారికి ఎటువైపు వెళ్లాలో అర్ధం కావడం లేదు. ఈ అంశంపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. అధిష్టానం కూడా ఇద్దరు నేతలకు సర్ది చెప్పే ప్రయత్నాలు చేసింది. కానీ ఎక్కడ సెట్ కాలేదు. మళ్ళీ రచ్చ మొదలైపోయింది.

ఇప్పటికే సీతంరాజు వచ్చే ఎన్నికల్లో టికెట్ తెచ్చుకుంటానని అంటున్నారు. అటు వాసుపల్లి సీటు తనదే అని చెబుతున్నారు. ఇలా ఇద్దరి మధ్య పంచాయితీ ఉంది. ఇక ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి లేదు. దీని వల్ల వైసీపీకే నష్టం.