ఇది కాజ‌ల్ కు మిగ‌తా హీరోయిన్ల‌కు ఉన్న తేడా.. చూసి నేర్చుకోండ‌మ్మ బాబు!

టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌దైన టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్న అందాల చంద‌మామ కాజ‌ల్ అగర్వాల్‌.. త‌మిళంలోనే అనేక సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించింది. టాలీవుడ్‌, కోలీవుడ్ భాష‌ల్లో అగ్ర హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా స‌త్తా చాటిన ఈ భామ‌.. 2020లో గౌత‌మ్ కిచ్లూను ఏడ‌డుగులు వేసింది.

ఈ దంప‌తుల‌కు గ‌త ఏడాది పండంటి మ‌గ బిడ్డ జ‌న్మించాడు. కొడుకు పుట్టిన కొద్ది నెల‌ల‌కే సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన కాజ‌ల్‌.. మ‌ళ్లీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో బిజీ అయింది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణకు జోడీగా `భ‌గ‌వంత్ కేస‌రి`, క‌మ‌ల్ హాస‌న్ తో `ఇండియన్ 2` చిత్రాలు చేస్తోంది. వీటితో పాటు `స‌త్య‌భామ‌` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీకి కూడా క‌మిట్ అయింది. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా మీడియాతో ఇంట్రెక్ట్ అయిన కాజ‌ల్ తెలుగు సినీ ప‌రిశ్ర‌మపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

`తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ నాకు పుట్టినిల్లు. టాలెంట్ ఉంటే ఇక్క‌డి ప్రేక్షకులు ఎంతో బాగా ఆదరిస్తారు. కాస్త విరామం తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.` అంటూ కాజ‌ల్ చెప్పుకొచ్చింది. నిజానికి చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుని.. బాలీవుడ్ కు మకాం మారుస్తారు. అక్క‌డ కాస్త క్రేజ్ రాగానే టాలీవుడ్ ను ఎగ‌తాళి చేస్తూ కామెంట్లు చేస్తుంటారు. ఈ జాబితాలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. ఇటీవ‌ల ర‌ష్మిక సైతం టాలీవుడ్ ను త‌క్కువ చేస్తూ మాట్లాడింది. కానీ, కాజ‌ల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ముంబై నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. కాజ‌ల్ మాత్రం తెలుగు ఇండ‌స్ట్రీనే త‌న పుట్టినిల్లు అని చెబుతుంటుంది. గ‌తంలో కూడా చాలా సార్లు టాలీవుడ్ పై త‌న మ‌మ‌కారాన్ని చూపించింది. ఈ నేప‌థ్యంలోనే కాజ‌ల్ చూసి మిగ‌తా హీరోయిన్లు నేర్చుకోవాలని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.