తెలుగులో రాజమౌళిని మించి కోట్లు సంపాదిస్తున్న స్టార్ డైరెక్టర్ ..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరంటే కచ్చితంగా రాజమౌళి పేరు వినిపిస్తూ ఉంటుంది.. రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించు కున్నారు.. ఇక రాజమౌళి కొన్ని సినిమాలకు కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటూనే మళ్లీ సినిమాలలో వాటాలు కూడా తీసుకుంటారని విషయం ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నది. దీంతో రాజమౌళి సంపాదన ఊహించని స్థాయిలో ఉంటుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటాయి. అయితే రాజమౌళి నాలుగేళ్లకు ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసింది సినిమాలకు సంబంధించి ఏవైనా అవాంతరాలు ఏర్పడితే ఆ సినిమా మరింత ఆలస్యం అవుతూ ఉంటుంది.

Trivikram Vs Rajamouli – Weapons on board
కానీ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటుంది. తాజాగా రాజమౌళి సంపాదనతో పోలిస్తే డైరెక్టర్ త్రివిక్రమ్ సంపాదన మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. త్రివిక్రమ్ తన తెలివితో భారీగానే సంపాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ ఒక్క చిత్రానికి దాదాపుగా రూ .35 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ఎటువంటి బాధ్యతలైన త్రివిక్రమే తీసుకుంటూ ఉంటారట.

అలాగే కొన్ని చిత్రాలకు డైలాగ్ రైటర్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరొకవైపు త్రివిక్రమ్ పలు రకాల యాడ్స్లకు కూడా దర్శకత్వం వహిస్తూ ఉంటారు. త్రివిక్రమ్ సొంత బ్యానర్ పై సితార ఎంటర్టైన్మెంట్ పై పలు సినిమాలను కూడా నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ విధంగా త్రివిక్రమ్ ఏడాదికి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏడాది సంపాదన రాజమౌళి కంటే ఎక్కువగా ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ తో గుంటూరు కారం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.