10 సినిమాల తరువాత ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ గుడ్ బై!

లోకేష్ కనగరాజ్..ఈ డైరెక్టర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. వరుస హిట్ లతో లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. మూడు సినిమాలు కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టాయి. మాస్టర్, ఖైదీ, కమల్ తో విక్రమ్ సినిమాలు తీసి హ్యాట్రిక్స్ సక్సెస్ లను అందుకున్నాడు. తన సినిమాలని ఒక యూనివర్స్ గా చేస్తున్నారు. తరువాత ఏ సినిమా వస్తుంది, ఆ సినిమాలలో ఎవరెవరు ఉంటారు అనేది సస్పెన్స్ గానే ఉంది. అయితే లోకేష్ కనగరాజ్ విజయ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లోకేష్ కనగరాజ్ తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇప్పుడు తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 10 సినిమా తరువాత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతానన్నారు. ఈ వార్త విని అందరు షాక్ అవుతున్నారు.

లోకేష్ ఇప్పుడు దళపతి విజయ్ తో లియో సినిమా చేస్తున్నాడు. మాస్టర్ తర్వాత మరోసారి విజయ్ తో లోకేష్ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయనే చెప్పొచ్చు. వీరిద్దరూ మరో హిట్ కచ్చితంగా కొట్టబోతున్నారని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరు ఎదురుచూస్తున్నారు. లియో సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతోందని తెలిసిందే.

అయితే విజయ్ పుట్టిన రోజు సందర్భంగా లోకేష్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక 10 సినిమాల వరకు తన సినిమాటిక్ యూనివర్స్ లో చేస్తానని.. ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి వెళ్లిపోతానని చెప్పుకొచ్చారు. ఈ మాటలు విని అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటి వరకు తనతో వర్క్ చేసిన అందరికి ప్రత్యేకంగా థాంక్స్ అంటూ తెలిపారు..విజయ్ తో చేస్తున్న లియో సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది.