దేవర చిత్రంలో ఆసిన్ హైలెట్ గా ఉండబోతోందా..!!

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు డైరెక్టర్ గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నరు డైరెక్టర్ కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా తెరకెక్కించి భారీ ఫ్లాప్ ని చవి చూశారు.. ఇప్పుడు కొరటాల మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని పక్క ప్లాన్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు.

NTR 30 Titled Devara: Jr NTR Looks Intense In The First Look Poster of His  Upcoming Film (View Pic) | 🎥 LatestLY

ఈ టైం లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమాను చేయబోతున్నాడు.ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నరు . ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ అవార్డు కూడా అందుకున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొరటాల శివ తారక్ తో దేవర అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు.ఈ సినిమాలో టాలీవుడ్ అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటించనుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి పలు రకాల అప్డేట్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా సముద్రం నేపథ్యంలో ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే దేవర మూవీ షూటింగ్ నుంచి కొన్ని వీడియోస్ ఫొటోస్ వైరల్ గా మారుతున్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు కొరిటాల శివ . ఈ మూవీలో ఓ అండర్ వాటర్ ఫైట్ సీన్ కూడా ఉందట.ఈ సీన్ కోసం సముద్రం ను తలపించే ఓ పెద్ద ట్యాంకును తెప్పించి షూట్ చేస్తున్నారట.ఈ సినిమాలో ఈ యాక్షన్ సీన్ తప్పకుండా చూడాల్సిందే.. ఈ సీని హైలెట్ గా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టుకి విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.