వ‌ర్కింగ్ డేస్‌లో బాగా వీక్ అయిపోయిన `ఆదిపురుష్‌`.. ఇంకా ఎంత రాబ‌ట్టాలో తెలుసా?

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేసిన తొలి మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 16న విడుద‌లైంది. అయితే టాక్ ఎలా ఉన్నా.. మొద‌టి మూడు రోజులు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ ప‌రంగా కుమ్మేసింది. రూ. 242 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆదిపురుష్‌.. ఫ‌స్ట్ 3 డేస్ లోనే ఏకంగా రూ. 151.60 కోట్ల షేర్‌, రూ. 302.50 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది.

అయితే వ‌ర్కింగ్ డేస్ లో మాత్రం ఈ సినిమా బాగా వీక్ అయిపోయింది. వీకెండ్ వ‌ర‌కు తెలుగులో రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల‌కు త‌గ్గ‌కుండా క‌లెక్ట్ చేసిన ఆదిపురుష్‌.. 4వ రోజు సోమ‌వారం కేవ‌లం రూ. 4.81 కోట్ల షేర్ ని మాత్రమే అందుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా 4వ రోజు రూ. 11.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

ఇక నాలుగు రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను గ‌మ‌నిస్తే తెలుగు రాష్ట్రాల్లో రూ. 69.76 కోట్ల షేర్‌, రూ. 110.40 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకున్న ఆదిపురుష్.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 63.45 కోట్లు షేర్, రూ. 326.15 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను ద‌క్కించుకుంది. ఇంకా రూ. 78.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే ఆదిపురుష్ బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఏరియాల వారీగా ఆదిపురుష్ 4 డేస్ క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి.

నైజాం: 32.00 కోట్లు
సీడెడ్: 8.14 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 8.90 కోట్లు
తూర్పు: 5.16 కోట్లు
పశ్చిమ: 3.66 కోట్లు
గుంటూరు: 6.11 కోట్లు
కృష్ణ: 3.88 కోట్లు
నెల్లూరు: 1.91 కోట్లు
————————————————-
ఏపీ+తెలంగాణ‌= 69.76 కోట్లు(110.40 కోట్లు~ గ్రాస్)
————————————————-

కర్ణాటక: 10.81 కోట్లు
తమిళనాడు: 2.06 కోట్లు
కేరళ: 0.72 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 59.20 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 20.90 కోట్లు
—————————————————
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌= 163.45 కోట్లు(326.15 కోట్లు~ గ్రాస్‌)
—————————————————