మరణించినా రాకేష్ మాస్టర్‌ని కూడా వదలని నీచులు.. ఎట్లా అవమానిస్తున్నారంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా, డాన్స్ మాస్టర్ గా పని చేశాడు రాకేష్ మాస్టర్. ఈ డ్యాన్సర్ అసాధారణ ప్రతిభతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే గత కొంతకాలంగా ఆయన మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్, డయాబెటిస్, రక్త విరోచనాలతో బాధపడుతున్నారు. ఈ రోగాల కారణంగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు.

రాకేష్ మాస్టర్ మరణ వార్త తెలియగానే ఆయన అభిమానులతో పాటు చాలామంది ప్రజలు ఆయనకు
సంతాపం తెలుపుతున్నారు. అయితే రాకేష్ మాస్టర్ చనిపోయి ఇప్పటికీ రెండు రోజులవుతుంది అయినా కానీ సినీ పరిశ్రమ నుండి ఎటువంటి స్పందన లేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కనీసం ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా రాకేష్ మాస్టర్ మృతి పట్ల సంతాపం తెలియజేయలేదు. దాంతో రాకేష్ మాస్టర్ అభిమానులు సినీ ఇండస్ట్రీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ మరణించిన తర్వాత కూడా ఇండస్ట్రీ వారు ఆయన్ని అవమానిస్తున్నారు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి రాకేష్ మాస్టర్ తన ముక్కుసూటి తనంతోనే ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గటంతో డాన్స్ స్కూల్ పెట్టి పూట గడిపాడు. ఒకప్పుడు ఎంతో లగ్జరీగా బ్రతికిన ఆయన చివరికి అద్దె ఇంట్లో ఉండే పరిస్థితిని తెచ్చుకున్నాడు. అంతటితో ఆగకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇండస్ట్రీలోని ఒక్కొక్కరిని విమర్శించేలా మాట్లాడుతూ మరింత దిగజారి పోయాడు. చివరిగా ఆయన నటించిన హనుమాన్ చిత్రం క్లైమాక్స్ లో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు ఆరోగ్యం పాడు కావడంతో వైద్యులు రెండు నెలల కంటే ఎక్కువ బ్రతకరని చెప్పినట్లు ఆయన అసిస్టెంట్ సాజిద్ వెల్లడించాడు. ఏదైతేనేం మరణం తర్వాత కూడా రాకేష్ మాస్టర్ కి అవమానాలు మాత్రం తప్పడం లేదు.