విశాఖపైనే పవన్ గురి.. వైసీపీకి రిస్క్ పెంచుతారా?

పవన్ కల్యాణ్ వారాహి మూడో విడత యాత్రని విశాఖలో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. విశాఖ జగదాంబ సెంటర్ లో భారీ సభ నిర్వహించారు. తర్వాత రిషికొండకు వెళ్ళి..అక్కడ సి‌ఎం క్యాంప్ ఆఫీసు నిర్మాణాలని పరిశీలించారు. ఇక వరుసగా విశాఖలో పవన్ పర్యటించనున్నారు. రోడ్ షోలు, భారీ సభలు ఏర్పాటు చేయనున్నారు. టోటల్ గా విశాఖపైనే పవన్ గురి పెట్టారు.

దసరాకు జగన్ విశాఖ నుంచే పాలన మొదలుపెడుతున్న నేపథ్యంలో పవన్..విశాఖలో పర్యటించడం చర్చనీయాంశమైంది. అక్కడ వైసీపీకి చెక్ పెట్టే దిశగా ఆయన రాజకీయం నడిపిస్తున్నారు. ఇప్పటికే మూడు రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదని, అలాగే ఎక్కకక్కడ జగన్ ప్యాలెస్‌లు నిర్మించుకుంటున్నారని విమర్శించారు. రిషికొండని తవ్వేసి అక్రమంగా కట్టడాలు కడుతున్నారని ఫైర్ అయ్యారు. అయితే విశాఖని పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసే దిశగా జగన్ వెళుతున్నారు. ఇలా రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రలో వైసీపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అటు రాయలసీమలో ఎలాగో వైసీపీకి ఆధిక్యం ఉంటుంది..ఇటు ఉత్తరాంధ్రపై పట్టు సాధిస్తే..వచ్చే ఎన్నికల్లో సులువుగా గెలిచేయొచ్చు అనేది జగన్ ప్లాన్‌గా తెలుస్తోంది.

కానీ ఉత్తరాంధ్రలో వైసీపీ బలపడటం అంత ఈజీ కాదనే చెప్పవచ్చు. ఓ వైపు టి‌డి‌పి బలపడుతుంది. ఇటు కీలకమైన విశాఖలో జనసేనకు కొంత బలం ఉంది. ఆ బలం మరింత పెంచేలా పవన్ యాత్ర కొనసాగుతుంది. ఇక టి‌డి‌పి-జనసేన కలిస్తే విశాఖలో వైసీపీకి రిస్క్ పెరుగుతుందనే చెప్పాలి. చూడాలి మరి జగన్ విశాఖకు వచ్చాక అక్కడ వైసీపీకి ఏమైనా కలిసొస్తుందేమో.