విశాఖపై జగన్ ఫోకస్..వైసీపీకి ప్లస్.!

విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి..జగన్ అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ చేసి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకోస్తున్న విషయం తెలిసిందే. విశాఖని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎలాగో సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపై మరింత శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు.

ఇదే క్రమంలో విశాఖ నుంచి కంపెనీలని తరిమేశారని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా జగన్..కొత్తగా విశాఖకు పెద్ద ప్రాజెక్టు తీసుకొస్తున్నారు.  ప్రముఖ రహేజా గ్రూప్ విశాఖలో దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్‌ని చేపడుతోంది. విశాఖ నగరంలో 17 ఎకరాల స్థలంలో 600 కోట్ల రూపాయలతో ఇనార్భిట్ మాల్‌ని నిర్మిస్తోంది. దీనికి జగన్ ఆగష్టు 1న శంఖుస్థాపన చేయనున్నారు. అయితే ఆల్రెడీ హైదరాబాద్‌లో ఇనార్భిట్ మాల్ అద్భుతంగా అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే మాల్ విశాఖకు వస్తుంది. దీంతో విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖలో ఎక్కడా లేని విధంగా ఈ మాల్‌ని డిజైన్ చేస్తున్నారు. అలాగే ఇందులో 280 పైగా కంపెనీలకు చెందిన ఔట్ లెట్స్ ఉంటాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా 2 వేల మందికి ఉపాధి కల్పించవచ్చు. అలాగే గతంలో పెట్టుబడుల సదస్సులో వచ్చిన పెట్టుబడులు ఇప్పుడుప్పుడే గ్రౌండ్ అవుతున్నాయి. దీంతో విశాఖ..హైదరాబాద్‌కు ధీటుగా ఎదగనుంది. ఇక కంపెనీలు తరిమేస్తున్నారని కామెంట్ చేస్తున్న ప్రతిపక్షాల నోర్లు మూతపడటం ఖాయం. అలాగే ఈ అంశాలు రాజకీయంగా వైసీపీకి ప్లస్ అవ్వనున్నాయి. మళ్ళీ విశాఖలో వైసీపీ హవా ఉండనుంది.