అలాంటి తప్పు చేస్తే బేబీ హీరోయిన్ కెరియర్ కూడా నాశనమేనా..?

సినీ ఇండస్ట్రీలో ఎవరు ఏ విధంగా సక్సెస్ అవుతారనే విషయం ఎవరము చెప్పలేము.. తాజాగా షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లలో నటిస్తూ తన కెరీయర్ని మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించుకుంది. కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలో నటించిన ఈమె బేబీ సినిమాతో తన అదృష్టం మారిపోయింది. బేబీ సినిమాలో హీరోల పాత్రతో పోలిస్తే వైష్ణవి చైతన్య పాత్ర ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బేబీ మూవీ సక్సెస్ తో చైతన్య కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది.

Vaishnavi Chaitanya - YouTube

టాలీవుడ్ లో కృతి శెట్టి కూడా తన మొదటి సినిమాతోనే మంచి విజయాలను అందుకోని ఆ తరువాత వరుసగా ప్లాపులను చవిచూస్తోంది. వైష్ణవి చైతన్య కూడా వేగంగా సినిమాలలో నటించడం కంటే సరైన కథలను ఎంపిక చేసుకొని కెరియర్ పరంగా సక్సెస్ సాధించుకుంటే రాబోయే రోజుల్లో అవకాశాలు మెండుగా ఉంటాయని అభిమానులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వైష్ణవి చైతన్య రెమ్యూనరేషన్ కూడా భారీ గాని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగమ్మాయి అయినప్పటికీ ఊహించని విధంగా సక్సెస్ సాధించడంతో అభిమానుల సైతం భారీగాన్ని పెరిగిపోయినట్లు తెలుస్తోంది.

Uncertain Future for Baby Heroine Vaishnavi Chaitanya?

వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఇతర హీరోయిన్లకు చాలా భిన్నంగా ఉండడంతో ఈమె కెరియర్ కు ప్లస్ అవుతోంది. వైష్ణవి చైతన్య కెరియర్ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆలస్యంగా వచ్చిన గుర్తింపు చేజారి పోనివ్వకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నారు.. అవకాశాల కోసం కథలు వినకుండా ఎలాంటి పాత్రలు అంటే అలాంటి పాత్రలో నటిస్తే కెరియర్ నాశనం అవుతుందని సైతం తెలియజేస్తున్నారు. మరి తన కెరీర్ ని సరైన దారిలో మలుచుకుంటుందో లేదో చూడాలి మరి.