తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ కే స్టార్ డం సంపాదించుకున్న కృతి శెట్టి గురించి రెండు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు.. అనంతరం వరసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. అనంతరం ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి.. కృతి శెట్టి కేవలం తెలుగులోనే కాకుండా తమిళం పైన కూడా బాగా దృష్టి పెట్టి అక్కడ పలు చిత్రాలలో నటిస్తోంది.
ప్రస్తుతం ఈమె తమిళ సినిమాలకు కూడా కమిట్ అయి పలు చిత్రాల షూటింగ్లో కూడా బిజీగా కనిపిస్తోంది. తెలుగులో ఈమెకు పెద్దగా ఏ సినిమాలలో కూడా అవకాశాలు రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళ సినిమాలతో బిజీగా ఉన్న కృతి శెట్టి టాలీవుడ్ హీరోల పైన సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమాలో నటించిన హీరోయిన్ మంచి సక్సెస్ అవుతేనే ఆ తర్వాత వారికి అవకాశాలు వస్తాయి లేకపోతే ఆ హీరోలు ఆ హీరోయిన్ గురించి అసలు ఆలోచించడం మానేస్తారంటూ తెలియజేసింది.
ఏదైనా అవసరం ఉండి మనం ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయారంటు తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో అలా కాదు ఇక్కడ హీరోలకు హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా హీరోయిన్ కష్టాన్ని మాత్రమే గుర్తిస్తారని తెలియజేసినట్లు తెలుస్తోంది.అల హిట్ ఫ్లాప్ అయిన సినిమాలతో సంబంధం లేకుండా అవకాశాలు కల్పిస్తారని తెలియజేసింది. ఇలా కోలీవుడ్ హీరోల గురించి గొప్పగా చెబుతూ టాలీవుడ్ హీరోలను ఏకీపారేయడంతో పలువురు అభిమానుల సైతం ఈమె పైన పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రోల్ కూడా చేయడం జరుగుతోంది. ఈ విషయంపై కృతి శెట్టి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.