ఆ స్టార్ హీరోకు లవర్‌గానే కాదు సిస్టర్‌గానూ యాక్ట్ చేసిన తమన్నా.. ఎవరంటే..

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఆమె తెలుగు, తమిళ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తోంది. ఆమె ఇటీవల రెండు వెబ్ సిరీస్‌లలో నటించింది, ఇవి రెండూ విమర్శకుల ప్రశంసలను పొందాయి. ఆ వెబ్ సిరీస్ లలోని సీన్‌లలో సిగ్గు విడిచి నటించిందీ మిల్కీ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ అందాల జాతరకు, బెడ్ రూమ్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ తార ఇప్పుడు రజినీకాంత్ నటించిన జైలర్ మూవీలో ఒక స్పెషల్ సాంగ్‌లో కూడా నటిస్తోంది.

ఇక తెలుగులోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్‌లో హీరోయిన్‌గా నటిస్తుంది ఈ చిన్నది. మెగాస్టార్‌కు జోడీగా ఈ సినిమాలో కనిపించనుంది. ఈ మూవీలో మహానటి కీర్తిసురేష్ చిరంజీవి చెల్లెలి పాత్ర చేస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. ఇటీవలే ఈ సాంగ్‌ను చేశారు. ఈ పాటలో తమన్నా వేసిన హుక్ స్టెప్ చాలా పాపులర్ అయ్యింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే హుక్ స్టెప్ కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే తమన్నా ఒకప్పుడు ఏ హీరోతో బీభత్సమైన రొమాన్స్ చేసిందో ఇప్పుడు అదే హీరోకి సిస్టర్‌గా నటిస్తుంది. ఆ హీరో మరెవరో కాదు మనందరికీ బాగా తెలిసిన అక్కినేని హీరో సుశాంత్. ఈ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నటించిన కాళిదాస్ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ భోళాశంకర్‌లో సుశాంత్ కి సిస్టర్‌గా కనిపించనుంది. భోళాశంకర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ వేదాళం సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతోంది.

తమన్నా సుశాంత్ సిస్టర్‌గా నటించడం చాలా కొత్త అనుభూతిని ఆఫర్ చేస్తుందని చెప్పవచ్చు. ఈ పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉందని తమన్నా చెప్పింది.