నారాయణకు దెబ్బ మీద దెబ్బ..కవర్ చేయలేకపోతున్నారా?

టి‌డి‌పి సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు ఇంటి పోరు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతుంది. ఆయన తమ్ముడి భార్య చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. తనని మానసికంగా వేధిస్తున్నారని, అర్ధరాత్రి సమయంలో భోజనం తీసుకురావాలని ఇబ్బందులకు గురి చేశారని నారాయణ తమ్ముడి భార్య కృష్ణప్రియ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కొన్ని సంవత్సరాలుగా ఈ వేధింపుల పర్వం కొనసాగుతోందని, 2019 నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేయాలంటూ నారాయణ తనను అనేక ఇబ్బందులకు గురి చేశారనీ కృష్ణప్రియ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా వైసీపీ రాజకీయం చేయిస్తున్నా ఎత్తుగడ అని, కావాలని నారాయణపై కుట్ర పన్నారని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. అలాగే తన భార్య మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, ఆమె చికిత్స తీసుకుంటుందని నారాయణ తమ్ముడు క్లారిటీ ఇచ్చారు.

అయినా సరే కృష్ణప్రియ వెనక్కి తగ్గలేదు.. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. నారాయణపై హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. అలాగే తాను మానసిక వ్యాధితో బాధపడుతున్నానంటూ భర్త చేసిన ప్రకటనలో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. అయితే టి‌డి‌పి నేతలకు మహిళలు అంటే అసలు గౌరవం లేదని, అందులో ఉన్న నారాయణ కూడా అంతే అని వైసీపీ విమర్శిస్తుంది.

కానీ ఇదంతా వైసీపీ ఆడిస్తున్న డ్రామా అని…ఇలాంటి ఫేక్ డ్రామాలు ఆడించడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. ఇలా ఎవరి వర్షన్ వారికి ఉంది. మరి ఇందులో ఏది నిజం అనేది క్లారిటీ లేదు. ఇక ప్రజలు ఎవరిని నమ్ముతారో వారి ఇష్టం.