వాట్‌.. మ‌హేష్ రిజ‌క్ట్ చేసిన ఆ ల‌వ్ స్టోరీ థియేట‌ర్స్‌లో ఏడాదిన్న‌ర ఆడిందా.. ఆ మూవీ ఏంటంటే..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోగా మెరిసిపోతున్న మహేష్ వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్. అయితే గ‌తంలో మహేష్ రిజెక్ట్ చేసిన ఓ లవ్ స్టోరీ ఏకంగా ఏడాదిన్నర ఆడి మేకర్స్ కు కనక వర్షం కురిపించిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఆ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హీరో ఎవరో ఒకసారి చూద్దాం. త్రివిక్రమ్ డైలాగ్ రైట‌ర్‌గా.. విజయభాస్కర్ డైరెక్షన్లో 2007లో రిలీజైన‌ నువ్వే కావాలి మూవీ టాలీవుడ్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచ్చిన సంగతి తెలిసిందే.

Rajakumarudu Movie

రామోజీరావు, స్రవంతి రవి కిషోర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మలయాళం లో హిట్ అయిన నీరం ఆధారంగా ఈ సినిమా రీమేక్ అయింది. అయితే మొదట ఈ సినిమాలో నటించే ఛాన్స్ మహేష్ బాబుకు వచ్చిందట. అప్పటికి మహేష్ బాబు హీరోగా కేవలం రాజకుమారుడు మూవీ మాత్రమే రిలీజ్ అయింది. అయితే మహేష్ సినిమాకు హీరోగా పర్ఫెక్ట్ ఆప్ట్ అవుతాడని స్రవంతి రవి కిషోర్ భావించార‌ట‌. నువ్వే కావాలి రీమేక్ గురించి మహేష్ కు చెప్పారట మూవీ ప్రొడ్యూసర్. అయితే ఆ సినిమాలోని పాత్ర తన ఇమేజ్‌కు సరిపోతుందో లేదో అనే సందేహంతో మహేష్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారు. మహేష్ ఈ సినిమా రిజెక్ట్ చేయడంతో తర్వాత సుమంత్, బాలీవుడ్ హీరో అప్తాబ్ దాసనీతో పాటు మరికొందరు హీరో రోల్ కోసం ఆడిషన్స్ జరిగాయని.. కానీ వారు ఎవరు ఈ సినిమాకు సెట్ కారని రిజెక్ట్ చేస్తారట‌ డైరెక్టర్.

21 Years of 'Nuvve Kavali': Actor Tarun Got The Film After These Two Stars Rejected it - News18

కాగా అప్పట్లో యాడ్‌లో క‌లిసి నటించిన తరుణ్, రీచాలను ఈ సినిమాలో బాగా సెట్ అవుతారని ఉద్దేశంతో హీరో, హీరోయిన్లుగా సెలెక్ట్ చేశారట. కేవలం కోటి రూపాయలు బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ‌ను కొల్లగొట్టి టాలీవుడ్ సినీ చరిత్రలో నిర్మాతలకు అత్యధిక లాభాలు తెచ్చిన‌.. బ్లాక్ బ‌స్టర్ గా నిలిచిపోయింది. దాదాపు 20 కి పైగా థియేటర్లలో 250 రోజులకు పైగా ఈ సినిమా ఆడి రికార్డులు సృష్టించింది. కొన్ని థియేటర్స్ లో అయితే షిఫ్ట్ విధానంలో ఏకంగా ఏడాదిన్నర పాటు సినిమా ఆడిందట. ఈ సినిమాతో తరుణ్, రీచాలకు యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే నువ్వే కావాలి లాంటి సూపర్ హిట్ సినిమాలో మహేష్ నటించి ఉంటే రెండో సినిమాతోనే ఇండస్ట్రియల్ హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరోగా నిలిచేవాడు.