జగన్ దూకుడు..కానీ అక్కడే తేడా కొడుతుంది.!

ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అధికార వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఇటు సి‌ఎం జగన్ సైతం రంగంలోకి దిగి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇలా కౌంటర్లు ఇవ్వడం అనేది కరెక్ట్ గానే ఉంది..కానీ ఆ కౌంటర్లు అనేవి ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే పెద్ద మైనస్ అవుతుంది. చంద్రబాబు, పవన్, లోకేష్..ఇలా నేతలు వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వారికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.

తాజాగా వెంకటగిరి సభలో కూడా జగన్ అదే చేశారు. గత కొన్ని రోజులుగా పవన్ వాలంటీర్లపై కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలు మిస్ అవ్వడానికి, డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు కౌంటర్లు ఇస్తే సరిపోతుంది. కానీ జగన్ మళ్ళీ..పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడారు. పనిలో పనిగా లోకేష్ అమెరికాలో ఉంటూ చదువుకున్న సమయంలో ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకున్న అంశం ప్రస్తావించారు. ఇక ఎప్పుడో 10 ఏళ్ల క్రితం బాలయ్య..ఒక సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ..అమ్మాయిలు కనిపిస్తే ముద్దు పెట్టాలి..అన్నట్లు మాట్లాడిన అంశాలని ఇప్పుడు వర్కికరించి చెప్పారు. ఇక ఆహా టాక్ షో చంద్రబాబు తన కాలేజ్ టైమ్ లో సరదాగా ఉన్న విషయాలపై కూడా విమర్శలు చేశారు.

అయితే జగన్ చెప్పిన విషయాలపై వారంతా ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. వాటిని ఇప్పుడు వేరే దురుద్దేశంతో చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. అలాగే పాలసీ పరమైన విధానాలపై మాట్లాడకుండా ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల ప్రజలకు..ఆ మాటలని సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉండవు. కాబట్టి ఎంత దూకుడుగా ఉన్న ఇలా వ్యక్తిగతంగా ప్రత్యర్ధులని టార్గెట్ చేస్తే ఉపయోగం ఉండదు.