బెజవాడ రాజకీయం..కేశినేని వైపే బాబు.?

మామూలుగానే బెజవాడ రాజకీయం బాగా హాట్‌గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చేసింది. దీంతో అక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీ, టి‌డి‌పిలు హోరాహోరీగా ఆధిక్యం దక్కించుకోవడానికి పోరాడుతున్నాయి. అదే సమయంలో ఆయా పార్టీల్లో అంతర్గతంగా కూడా రాజకీయం నడుస్తుంది. అంటే సీట్లు దక్కించుకోవడం కోసం నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ సీటుపై రెండు పార్టీల్లో చర్చ మొదలైంది.

అయితే ఇప్పటివరకు విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి ఎవరు నిలబడతారో క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పి‌వి‌పి..ఇప్పుడు టి‌డి‌పికి అనుకూలంగా మారినట్లు తెలుస్తుంది. దీంతో వైసీపీకి ఇంకా అభ్యర్ధి లేరు. ఎవరు బరిలో ఉంటారో క్లారిటీ లేదు. ఇక ఇటు టి‌డి‌పిలో ఏమో పోటీ ఎక్కువగా ఉంది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. కానీ ఇటీవల ఆయన సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం..సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా గెలుస్తానని అనడంతో సీన్ రివర్స్ అయింది.

ఈక్రమంలోనే కేశినేని సోదరుడు చిన్ని విజయవాడ పార్లమెంట్ లో పనిచేస్తున్నారు. కేశినేని వ్యతిరేకంగా ఉన్న టి‌డి‌పి నేతలని కలుపుకుని ముందుకెళుతున్నారు. ఈయన కూడా సీటు ఆశిస్తున్నారు. మరి ఏం అనుకున్నారో ఏంటో గాని..ఈ మధ్య కేశినేని నాని మళ్ళీ టి‌డి‌పిలో యాక్టివ్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా టి‌డి‌పి పార్లమెంటరీ నేతల సమావేశానికి హాజరయ్యారు.

దీంతో ఆయన టి‌డి‌పి నుంచే మళ్ళీ పోటీ చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. అటు పి‌వి‌పి సైతం..టి‌డి‌పి-జనసేన పొత్తు ఫిక్స్ అయితే..విజయవాడ ఎంపీ సీటు తీసుకోవాలని చూస్తున్నారు. కానీ సర్వేలు కేశినేనికే అనుకూలంగా ఉన్నాయని తెలుస్తుంది..ఆయన నిలబడితే మళ్ళీ గెలుపు ఈజీ అని అంటున్నారు. పైగా వైసీపీ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ పడుతుందని చెబుతున్నారు. అందుకే బాబు..కేశినేని వైపే ఉన్నారని తెలుస్తుంది.