కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ కొత్త లుక్‌.. పిచ్చెక్కించేశాడు అంతే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కామిక్ కాన్ ఈవెంట్ లో స‌రికొత్త లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న మూవీ `ప్రాజెక్ట్ కె`. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొణె మరియు దిశా పటాని వంటి టాప్ స్టార్స్ భాగం అయ్యారు.

అయితే నేడు అమెరికాలోని శాన్ డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ 2023లో ఈ సినిమా టైటిల్ మ‌రియు ఫ‌స్ట్ గ్లింప్స్‌ ను గ్రాండ్ గా లాంచ్ చేయ‌బోతున్నారు. ప్రాజెక్ట్ కెలో కె అంటే కాలచక్రం, కలియుగం, కురుక్షేత్రం అంటూ ప‌లు పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. మ‌రికొన్ని గంట‌ల్లో ప్రాజెక్ట్ కె అంటే ఏంటో తేల‌బోతోంది. బుధ‌వారం సాయంత్రం ప్రాజెక్ట్ కెలోని ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.

అన్న‌ట్లు కామిక్ కాన్ ఈవెంట్ కోసం ఇప్పటికే ప్రభాస్ తో స‌హా చిత్రయూనిట్ అమెరికాకు చేరుకున్నారు. తాజాగా కామిక్ కాన్ ఈవెంట్ మొదలైంది. ప్రాజెక్ట్ కె టీమ్ అక్క‌డ ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది. అయితే కామిక్ కాన్ ఈవెంట్ కు ప్ర‌భాస్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా న్యూ లుక్ లో పిచ్చెక్కించేశాడు. జీన్స్, బ్లూ సూట్ వేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌భాస్ ఇంత హ్యాండ్స‌మ్ గా క‌నిపించ‌లేద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ లేటెస్ట్ లుక్ నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. ఫ్యాన్స్ కు ఆయ‌న్ను చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌డం లేదు.