అందుకే శ్రీహరి డిస్కో శాంతి దగ్గర మాట తీసుకున్నారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా విలన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు శ్రీహరి.. ఎన్నో చిత్రాలలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పార్టీ సంపాదించిన శ్రీహరి గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. 1996లో డిస్కో శాంతి శ్రీహరిని వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. డిస్కో శాంతి కూడా ఒక నటినే..

Srihari Wife Disco Shanthi Used Drugs - Telugu Bullet

అయితే ఇంట్లో అనుకోకుండా కొన్ని కారణాల వల్ల డాన్సర్ గా మారింది. శ్రీహరి డిస్కో శాంతిని మొదట పరిచయంలోనే బావ అని పిలవమని ప్రపోజ్ చేశారట.. ఎప్పటికీ కూడా తనని అలాగే పిలుస్తూ ఉండమని తన దగ్గర ఒక మాట తీసుకున్నట్లు సమాచారం.. దీంతో మా ఇద్దరి మధ్య చాలా బాండింగ్ ఉండేదని ఎలాంటి విభేదాలు లేకుండా చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళమంటే ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది డిస్కో శాంతి. తామిద్దరం వివాహమైన తర్వాత కలిసి ఉన్న ఇంట్లోనే ఇప్పటికీ తన జ్ఞాపకాలతో తన కొడుకులతో కలిసి ఉంటున్నానని తెలియజేసింది.

Injection into the liver! Blood in the eyes.. How did actor Srihari die? Disco  Shanti Kannir | How did Actress Disco Shanthi's husband Srihari die in  Mumbai hospital

శ్రీహరి తన దగ్గరకు వచ్చి ఎవరైనా కష్టాలలో ఉన్నారంటే చాలు అసలు ఊరుకునేవారు కాదు.. అంతో ఎంతో కొంత తన దగ్గర ఉన్న డబ్బును ఇచ్చి పంపించేవారని ఈ విషయంలో తన భర్త గొప్ప మనసును తాను అర్థం చేసుకున్నానని తెలియజేసింది డిస్కో శాంతి. అయితే అలా ఎంతో మందికి ఇచ్చిన శ్రీహరి మరణించిన తర్వాత డబ్బు ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్లి డబ్బు తీసుకురమ్మని తన అన్నయ్యని పంపించగా వారు శ్రీహరి చనిపోయే ముందు రోజే తాము తనకి డబ్బులు ఇచ్చేశామని చెప్పారని దీంతో మనుషులు ఇలా కూడా ఉంటారా అని అర్థమయిందని తెలియజేసింది. ఈ విషయం విన్న తర్వాత తనకు చాలా బాధేసిందని ఇక అప్పటినుంచి ఎవరిని కూడా అడగలేదని తెలియజేసింది.