కాంగ్రెస్‌లోకి షర్మిల ఫిక్స్..ఏపీలోకి ఎంట్రీ ఇస్తారా?

మొత్తానికి వైఎస్ షర్మిల…కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని తేలిపోయింది. అతి త్వరలోనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని తెలుస్తుంది. ఇటీవల ఆమె చేస్తున్న రాజకీయం..అలాగే కాంగ్రెస్ లో కొందరు నేతలు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే..షర్మిల ఇంకా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయిందని తెలుస్తుంది. ఇటీవలే కే‌వి‌పి రామచంద్రారావు..విలీనంపై చర్చలు జరుగుతున్న విషయం వాస్తవమని చెప్పుకొచ్చారు.

అటు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సైతం..విలీనం అంశం ఏ‌ఐ‌సి‌సి చూసుకుంటుందని అన్నారు. దీని బట్టి చూస్తే ఆమె కాంగ్రెస్ లోకి రావడం ఖాయం. ఇక ఆమె పార్టీ పెట్టిన దగ్గర నుంచి కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే విరుచుకుపడుతున్నారు. అటు బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిలని సైతం కలిపి టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆమె కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. కాకపోతే ఆమె ఏపీ రాజకీయాల్లోకి రావాలని అక్కడ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. వైఎస్సార్‌ ఏపీకి చెందిన నేత కాబట్టి..ఇక్కడికే వచ్చే ఆమె రాజకీయం చేయాలని అంటున్నారు.

అయితే ఏపీలో షర్మిల అన్న..జగన్ ఏపీకి సి‌ఎం. కాబట్టి అక్కడకు వెళ్ళడం కష్టమని చెప్పవచ్చు. ఇక తాను తెలంగాణ కోడలు అని, ఇక్కడే రాజకీయం చేస్తానని మొదట నుంచి చెబుతున్నారు. దీంతో ఆమె తెలంగాణలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. పైగా జగన్ సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు.

కాబట్టి షర్మిల ఎంట్రీ కూడా ఖాయమే. కాకపోతే గతంలో చంద్రబాబుని టార్గెట్ చేసి ఆంధ్రా పెత్తనం అని కే‌సి‌ఆర్ విమరసలు చేసి కాంగ్రెస్ ని దెబ్బకొట్టారు. ఇప్పుడు షర్మిల కూడా ఆంధ్రా అని చెప్పి బి‌ఆర్ఎస్ రాజకీయం చేసే ఛాన్స్ ఉంది. చూడాలి మరి షర్మిల రాజకీయం ఎలా ఉంటుందో.