పొత్తులపై టీడీపీ క్లారిటీ ఇదే..కమ్యూనిస్టులతోనే..!

ఏపీలో పొత్తులపై ట్విస్ట్‌లు నడుస్తూనే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో టి‌డి‌పి-బి‌జే‌పి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నాయని, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మూడు పార్టీలు కలుస్తాయని పవన్ అన్నారు. అలాగే సి‌ఎం సీటు ఎన్నికల తర్వాత తేల్చుకుంటామని అన్నారు. ఇలా పవన్ పొత్తులపై మాట్లాడిన నేపథ్యంలో టి‌డి‌పి నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ టి‌డి‌పి శ్రేణులు మాత్రం ఎవరితో ఎలాంటి పొత్తు వద్దని, బి‌జే‌పితో పొత్తు వల్ల నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు.

అలాగే చంద్రబాబు ఉండగా సి‌ఎం సీటుపై చర్చ అవసరం లేదని, కానీ పవన్ ఎన్నికల తర్వాత సి‌ఎం సీటు గురించి చర్చ అనడం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంటుందని, కనీసం సి‌ఎం ఎవరు తెలియదని భావిస్తారని, దాని వల్ల జగన్‌కే మేలు అని అంటున్నారు. అయితే పొత్తులపై ఇప్పుడు తమకు ఎలాంటి ఆలోచన లేదని, ఎన్నికల సమయంలోనే చూస్తామని చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుతం టి‌డి‌పి స్టాండ్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటికే బాబు-పవన్ మూడుసార్లు కలిశారని, పొత్తులపై చర్చ లేదని, కానీ జనసేనతో కలిసి పోరాడుతున్నామని చెబుతున్నారు. అలాగే గత ఎన్నికల తర్వాత సి‌పి‌ఐ పార్టీతో కలిసి ముందుకెళుతున్నామని…చాలా అంశాల్లో సి‌పి‌ఐ తో కలిసి టి‌డి‌పి పోరాటాలు చేసిందని చెబుతున్నారు. అంటే ప్రస్తుతానికి ఇదే టి‌డి‌పి స్టాండ్ అని…ఇక ఏ అంశమైన  ఎన్నికల ముందు తేల్చుకోవడమే అని…అది కూడా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉండటమే టి‌డి‌పి శ్రేణుల కర్తవ్యం అని అంటున్నారు.