ముద్దు పెట్టబోయిన అవినాష్.. చెంప చెల్లుమనిపించిన శ్రీముఖి..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం అన్ని చానల్స్ లో తన హవా కొనసాగిస్తూనే ఉంది. స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివార్ అనే షో కి ఈమె యాంకర్ గా చేస్తోంది. సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటీనటులు గెస్ట్లుగా రావడం జరిగింది. తాజా ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది. ఈ కొత్త ఎపిసోడ్ లో రెట్రో ఓల్డ్ థీమ్ తో ముక్కు అవినాష్ సందడి చేయడం జరిగింది.

పాత సీరియల్స్ కి చెందిన నటీనటులు ఈ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. అయితే ఇందులో ముద్దుల టాస్క్ రావడంతో స్టేజ్ పైన రచ్చ రచ్చ జరిగింది. అయితే ఈ ప్రోమోలో ఎవరూ ఊహించని ఒక సన్నివేశం జరిగింది. అదేమిటంటే శ్రీముఖి మధ్యలో పార్ధు ఒకసారి వచ్చి నాకు ముద్దు పెట్టు అంటూ అవినాష్ ను షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరకు తీసుకుంది. దీంతో అవినాష్ నిజంగానే ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయి ఆమెకు ముద్దు పెట్టబోయారు ఈ క్రమంలోని శ్రీముఖి అవినాష్ చంపపై ఒకటి ఇచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ ప్రోమో లో కనిపిస్తోంది.

అయితే ఈ ప్రోమో మాత్రం బాగా ఆకట్టుకుంది . నిజజీవితంలో శ్రీముఖి, అవినాష్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసింది గతంలో కూడా శ్రీముఖి బిగ్ బాస్-3 లోకి వెళ్లినప్పుడు కూడా ఆమెకు ఓట్లు వేయించే బాధ్యత అవినాష్ తీసుకున్నారు. ఆ తర్వాత బిగ్బాస్-4 లో అవినాష్ పాల్గొనడంతో శ్రీముఖి బాగా ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.