స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమా తీయాలంటే రైటర్ సహాయం కావాల్సిందేనా.. మహేష్ బాబు సినిమాకు సహాయం చేసేదేవరు..?!

మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో త్వరలోనే ఓ సినిమా తెర‌కెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాకముందే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇంకా సినిమా టైటిల్‌ని కూడా రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను సంపాదిస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కించే విధంగా జక్కన్న ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక దీంతో మహేష్, రాజమౌళి అభిమానుల సినిమాపై అంచనాలు రెట్టింపు అయిపోతున్నాయి. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో డైలాగ్ వెర్షన్ మొదలు పెట్టడానికి రాజమౌళి ఒక పర్ఫెక్ట్ రచయిత కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే పర్మినెంట్గా పని చేస్తే టెక్నికల్ టీం కచ్చితంగా ఉంటుంది. అందులోనూ ఎక్కువగా ఆయన కుటుంబ సభ్యులే ఇన్వాల్వ్ అవుతారు. అయితే రైటర్‌ను మాత్రమే ఎప్పటికప్పుడు రాజమౌళి మారుస్తూ ఉంటాడు. ఆర్ఆర్ఆర్‌ సినిమా కోసం బుర్ర సాయి మాధవ్ రచయితగా పనిచేశాడు. కాగా మహేష్ సినిమా కోసం ఆయనని కాకుండా మరో రచయిత కోసం జక్కన్న వెతికే ప్రయత్నాలు చేస్తున్నాడట. నిజానికి జక్కన్న సినిమాలో పనిచేసే డైలాగ్ రైటర్ కి పెద్దగా పనేమి ఉండదు. ఎందుకంటే ఆయన కేవలం యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలను హైలెట్ చేసేలా సినిమాను తెర‌కెక్కిస్తారు.

కనుక డైలాగ్ ఓరియంటెడ్ సీన్స్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక కీ డైలాగ్స్ నరేషన్‌ టైంలోను రాజమౌళినే వారికి ఫీడ్ చేసేస్తాడ‌ట. అంతకు ముందు సినిమాలకు రత్నం, కాంచి డైలాగులు అందించిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా కోసం మాత్రమే బుర్ర సాయి మాధవ్ ను తీసుకున్నాడు జ‌క్కన. ఇప్పుడు మరో రచయిత కోసం ఎదురుచూస్తున్న రాజమౌళి ఎవరికి రైట‌ర్‌ ఛాన్స్ ఇస్తాడు అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే లుక్ టెస్ట్ చేయించుకోగ‌ 8 లుక్స్ ఫైనలైజ్ అయ్యాయట. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఏవి బయటకి రాకుండా టీం చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.